పకడ్బందీగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభం
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : మండల కేంద్రమైన గడివేముల లో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మండలంలోని పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పదవ తరగతి పరీక్ష కేంద్రాలను స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, మోడల్ స్కూల్ రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రం వద్ద చేరుకొని తమ తమ హాల్ టికెట్ నెంబర్లు రూములు వెతుక్కోవడం ప్రారంభమైంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం లో 196 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 153 మంది విద్యార్థులు హాజరైనట్లు, నలుగురు విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు ఎగ్జామ్ చీఫ్ రసూలుల్లా ఖాన్ తెలిపారు. పరీక్షా కేంద్రం మోడల్ స్కూల్ నందు 215 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 163మంది విద్యార్థులు హాజరైనట్లు, 15 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు ఎగ్జామ్ చీఫ్ సుబ్బరాయుడు తెలిపారు. గడివేముల మండలంలో మొత్తం 411 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా 316 మంది విద్యార్థులు హాజరయ్యారు 19 విద్యార్థులు గైర్హాజరయ్యారు.ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యార్థులకు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రధమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేశారు అలాగే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సై బి. టి వెంకటసుబ్బయ్య పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పరీక్ష కేంద్రాలను తన సిబ్బందితో పరిశీలించారు చుట్టుపక్కల ఎవరైనా సంచరించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షాల కేంద్రాల వద్ద మొదటిరోజు ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించారు.