PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హైద‌రాబాద్‌లో 23న ఫాల్కన‌ర్‌ యూనివ‌ర్సిటీ స్పాట్ అడ్మిష‌న్లు

1 min read

పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్​:  మాంట్‌గోమ‌రీ, అల‌బామా, మార్చి 18, 2024: అంతర్జాతీయ వైవిధ్యాన్ని పెంపొందించడానికి తన విద్యాప‌ర‌మైన‌ శ్రేష్ఠతకు, నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన ఫాల్కన‌ర్‌ యూనివ‌ర్సిటీ భారతదేశం నుంచి విద్యార్థులను చేర్చుకునే ల‌క్ష్యంతో ఒక వ్యూహాత్మక కార్యక్రమాన్ని ప్రక‌టించింది. యూనివ‌ర్సిటీ ప్రెసిడెంట్‌ మిచ్ హెన్రీ దార్శనిక నాయకత్వంలో, ఫాల్కన‌ర్‌ యూనివ‌ర్సిటీ ప్రపంచ‌వ్యాప్తంగా త‌న ఉనికిని చాటుకుంటోంది. భారతీయ విద్యార్థుల ప్రత్యేక అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మంచి మార్పుతో కూడిన‌ చ‌దువును అందిస్తోంది.ఫాల్కన‌ర్‌ యూనివ‌ర్సిటీ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ మేనేజ్‌మెంట్ ఇన్ బిజినెస్ ఎనలిటిక్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ మేనేజ్‌మెంట్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి గౌరవప్రదమైన కోర్సుల‌ను అతి త‌క్కువ ట్యూష‌న్ ఫీజుల‌తో అందిస్తోంది. మొత్తం ఫీజు సుమారు 17,500 డాలర్లు మాత్రమే కావ‌డంతో.. ఇది భారతీయ విద్యార్థులకు అధునాతన వ్యాపార విద్యను మరింత అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ సంద‌ర్భంగా యూనివ‌ర్సిటీ ప్రెసిడెంట్‌ మిచ్ హెన్రీ మాట్లాడుతూ, “అందుబాటులో ఉండే ఈ ఫీజుల ద్వారా నాణ్య‌మైన అంత‌ర్జాతీయ విద్యతో పాటు, సాంస్కృతిక వైవిధ్యం కూడా విద్యార్థుల‌కు అందుతుంది” అని చెప్పారు.  అలబామాలోని మాంట్‌గోమెరీలో ఉన్న తన వైవిధ్యమైన విద్యా, సాంస్కృతిక వాతావ‌ర‌ణంలోకి అంత‌ర్జాతీయ విద్యార్థుల‌ను ఫాల్కన‌ర్‌ యూనివ‌ర్సిటీ ఆహ్వానిస్తోంది. 1942 లో స్థాపించినప్పటి నుంచి ఆకర్షణీయమైన ప్రాంగణం, విద్యాప‌ర‌మైన శ్రేష్ఠత‌ల‌కు క‌ట్టుబ‌డిన ఈ యూనివ‌ర్సిటీ.. సమగ్ర విద్యార్థి అభివృద్ధి అనుభవాన్ని అందిస్తుంది.అంత‌ర్జాతీయంగా విస్తరించ‌డం కోసం ఫాల్కన‌ర్‌ యూనివర్సిటీ హైదరాబాద్ లోని అంత‌ర్జాతీయ భాగ‌స్వామి అయిన యూనివర్సిటీ  హబ్ తో ప్రత్యేక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ముఖ్యంగా ఐటీ మరియు వ్యాపార రంగాలలో విద్యార్థుల చేరిక‌ను క్రమబద్ధీకరించడ‌మే లక్ష్యంగా పెట్టుకుంది.హైద‌రాబాద్‌లోని తాజ్ వివాంటా హోట‌ల్లో స్పాట్ అడ్మిష‌న్లు నిర్వహించ‌నున్నట్లు ఫాల్కన‌ర్‌ యూనివ‌ర్సిటీ ప్రక‌టించింది. ఈ యూనివ‌ర్సిటీలో అందించే వివిధ కోర్సుల గురించి తెలుసుకోవ‌డానికి, అంకితభావం కలిగిన విశ్వవిద్యాలయ ప్రతినిధులను సంప్రదించ‌డానికి విద్యార్థులకు ఈ కార్యక్రమం అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది.యూనివర్సిటీ హబ్ వ్యవస్థాపకుడు డాక్టర్ అనిల్ పల్లా ఫాల్కన‌ర్‌ యూనివ‌ర్సిటీ ప్రవేశాల ప్రక్రియపై విశ్వాసం వ్యక్తం చేశారు, దాని వ్యాపార, విద్యా కోర్సుల విలువ‌ను ఆయ‌న తెలియ‌జేశారు. ఫాల్కన‌ర్‌ యూనివ‌ర్సిటీకి ప్రత్యేక భాగ‌స్వామిగా, యూనివ‌ర్సిటీ హ‌బ్ విద్యార్థుల‌కు ఉచిత సేవ‌లు అందించానికి క‌ట్టుబ‌డి ఉంది. వాటిలో ప్ర‌మాణాల‌తో కూడిన ప‌రీక్ష‌లకు సాయం చేయ‌డం, యూనివ‌ర్సిటీ ఎంపిక‌, వీసా ఇంట‌ర్వ్యూకు సిద్ధం కావ‌డం, అమెరికా వెళ్ల‌డానికి ముందు కావ‌ల్సిన శిక్షణ అన్నీ అందిస్తారు. ఈ భాగ‌స్వామ్యం ద్వారా ఫాల్కన‌ర్‌ యూనివ‌ర్సిటీ అందించే అంత‌ర్జాతీయ కోర్సులు మ‌న విద్యార్థుల‌కు మ‌రింత అందుబాటులోకి వ‌స్తాయి.

About Author