నేత్రపర్వం కొంతలపాడు.. అంబా సహిత యాగంటీశ్వర స్వామి రథోత్సవం
1 min readవేలాదిగా తరలి వచ్చిన భక్తజనం..
పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్లు: కర్నూలు (జిల్లా ) ఓర్వకల్లు (మం ) కొంతల పాడు గ్రామంలో శ్రీ యాగంటీశ్వర శరణం ప్రపద్యే నామంతో యాగంటి శ్వరస్వామి క్షేత్రం మారుమోగింది.గ్రామంలో వెలిసిన అంబా సహిత యాగంటి శ్వరస్వామి రథోత్సవం బుధవారం తెల్లవారు జామున అశేష భక్తుల మధ్య కన్నుల పండుగగా జరిగింది. ముందుగా ఉత్సవ మూ ర్తులకు ప్రధాన అర్చకులు ఉరుకుందయ్య శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, ఉత్సవమూర్తులను పల్లకిలో ఉంచి మేళ తాళాలు, భాజాభజంత్రీలు, నందికోల సేవ, మధ్య రథోత్సవం వరకు తీసుకెళ్లి రథోత్సవంపై అధిష్టింపచేశారు.
రథం ముంగి ట కుంభం పోసి, రథాంగ బలి కూష్మాండ బలి తో ప్రత్యేక పూజలు జరిపి రథోత్సవాన్ని ప్రారంభించారు . అశేష జన సమూహం మధ్య సాగిన రథోత్సవంపై భక్తులు పూలు పండ్లు విసిరి తన్మయం చెందారు . రథోత్సవం స్థానిక నంది స్థూపం వరకు వెళ్లి తిరిగి పూర్వ స్థానానికిచేరుకుంది. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి స్వామివారిని ద ర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబా సహిత యాగంటీశ్వర స్వామి వారి మహత్యాన్ని ప్రపంచానికి తెలిపెందుకు కొంతలపాడు కురువ ఆవుల బ్రహ్మాయ్య కుమారుల చే https://ambasahitha yaganteeswaraswamy.com/ బ్లాగ్ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈ ఓ మద్దిలేటి ఆలయ చైర్మన్ కుమ్మరి మద్దయ్య, మీదివేముల ప్రభాకర్ ఆలయ ధర్మకర్తలు, చాకలి యాగంటయ్య, జగదీశ్వర్ గౌడ్, బోయ హరిరామ్, , ఎరుకల లక్ష్మీదేవి, మంద లక్ష్మీదేవి, పోలు కంటి ఉషారాణి, ఈడిగ రాముడు, తదిరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న సంగీత విభావరి.