ప్రశాంత ఎన్నికలే లక్ష్యం… కేంద్ర సాయుధ బలగాలతో కవాతు
1 min readకర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్
ప్రజలు స్వేచ్ఛగా , నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలజిల్లాలోని పలు ప్రాంతాలలో కేంద్ర సాయుధ బలగాల తో పోలీసుల కవాతు.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు కవాతు నిర్వహించారని కర్నూల్ జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసులు ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో కవాతు నిర్వహించారన్నారు.ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎన్నికలలో ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా దానికి జిల్లా పోలీసు యంత్రాంగం సహకారం ఎల్లవేళలా ఉంటుందని జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ తెలిపారు.ఈ రోజు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాలలో కేంద్ర సాయిధ బలగాలైన “సశస్త్ర సీమా బల్” సిబ్బందితో కలిసి పోలీసులు కవాతు నిర్వహించారు. కర్నూలు తాలుకా పోలీసుస్టేషన్ పరిధిలోని పి. రుద్రవరం, గార్గేయపురంలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో కర్నూలు తాలుకా సిఐ శ్రీధర్ , ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.