జగస్ పని అయిపోయింది…!
1 min readవైకాపా నాయకులారా! కార్యకర్తలారా! కాంగ్రెస్ లోకి రండి
రాజశేఖరరెడ్డి ఆశయాన్ని నెరవేరుద్దాం.
6 సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేస్తాం..
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన బిజెపితో పొత్తు పెట్టుకోవడం దుర్మార్గం.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది వైకాపా నాయకులు కాంగ్రెస్ నాయకులు పార్టీలోకి తిరిగి రావాలని కాంగ్రెస్ నంద్యాల పార్లమెంటు జిల్లా డిసిసి అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ పిలుపునిచ్చారు..నంద్యాల పట్టణంలో రాజీవ్ గాంధీ భవనం కర్తలసమావేశంలో మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైకాపా చిత్తుచిత్తుగా ఓడిపోతుందని, జగన్ శంకరగిరి మాన్యాలకు పోక తప్పదని, లక్ష్మీ నరసింహ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు జగన్ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారన్నారు. రైతులు రగిలిపోతున్నారు. మహిళలు, మందుబాబులు మండిపోతున్నారు. ఉద్యోగులు ఉడికిపోతున్నారు. యువత ఆవేశంతో ఉన్నారు. కాంట్రాక్టర్లు కసితో ఉన్నారు. సర్పంచులు ఆగ్రహంతో ఉన్నారన్నారు.జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల, అవినీతి, అరాచక, మధ్య, జూద, గంజాయి, డ్రగ్ ఆంధ్ర ప్రదేశ్ గా మారిందని నిప్పులు చెరిగారు.రాష్ట్రంలో ల్యాండ్, పాండ్, మైన్, వైన్, ఎర్రచందనం, బియ్యం మాఫియాలు రాజ్యమేలుతున్నాయని విరుచుకుపడ్డారు…అదానీ వ్యవహారంలో మోడీ ప్రతిష్ట, వివేక హత్య కేసు వ్యవహారంలో జగన్ ప్రతిష్ట పాతాళానికి పడిపోయాయి అన్నారు.కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని వైకాపా నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని స్వగృహప్రవేశం చేయాలని లక్ష్మీ నరసింహ యాదవ్ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన జీవితాశయం అని స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి పదేపదే చెప్పి వారని, ఆయన ఆశయ సాధన కోసం అందరూ చేయి చేయి కలుపుదాం అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు.1. ఆరు (3) లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ,2. 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా.3. ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు Rs.6000 ఆర్థిక సహాయం.4 సంజీవిని లాంటి ప్రత్యేక హోదా అమలు,5. రాయలసీమ, ఉత్తరాంధ్రకు బుందేల్బండ్ తరహా అభివృద్ధి ప్యాకేజీ అమలు. 6. పోలవరం, కడప జిల్లాలో S.A.I.L. (STEEL AUTHORITY OF INIDA LIMITED) ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం, రాజధానితో సహా విభజన చట్టంలో పేర్కొనబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడం.మీడియా సమావేశంలో నంద్యాల పట్టణ అధ్యక్షులు చింతలయ్య ఆంధ్రప్రదేశ్ పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల్ మోహన్రావు నంద్యాల పార్లమెంట్ ఉపాధ్యక్షుడు బోయ రమణ శ్రీరాములు మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.