NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌ర్నూలులో ఓ కూలీకి వ‌జ్రం దొరికింది !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : రాయ‌లేలిన సీమ‌.. ర‌త‌నాల సీమ‌. సీమ‌లో రాళ్లే కాదు .. ర‌త్నాలు, వ‌జ్రాల‌కు కొద‌వ లేద‌న్న నానుడిని నిజం చేస్తోంది జొన్నగిరి ప్రాంతం. క‌ర్నూలు జిల్లాలో ఉన్న జొన్నగిరి ప్రాంతం.. ఒక‌ప్పుడు శ్రీకృష్ణదేవ‌రాయ‌ల పాల‌న‌లో ఉండేద‌ని అక్కడి శాస‌నాలు చెబుతున్నాయి. తొల‌క‌రి వర్షం ప‌డ‌గానే ఈ ప్రాంతంలో వ‌జ్రాల వేట మొద‌ల‌వుతుంది. క‌ర్నూలుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి జ‌నం వజ్రాల వేట కోసం వ‌స్తారు. ఆదివారం ఓ మ‌హిళ‌కు ఓ వ‌జ్రాం దొరికింద‌ని స‌మాచారం. ట‌మోట పైరు నాటుతున్న సంద‌ర్భంలో ఈ వ‌జ్రం ల‌భించిన‌ట్టు స‌మాచారం. స్థానికంగా ఉన్న ఓ వ్యాపారికి ఆ వ‌జ్రాన్ని 6 ల‌క్షల‌కు అమ్మిన‌ట్టు తెలుస్తోంది.

About Author