జిల్లా టిడిపి కార్యాలయంలో పాలి ప్రసాద్ సంతాప సభ
1 min readపెద్ద ఎత్తున పాల్గొన్న పార్టీ నాయకులు, అభిమానులు కుటుంబ సభ్యులు
ఏలూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బడేటి చంటి
ఆయన సేవలు పార్టీకి, కుటుంబ సభ్యులకు తీరని లోటు
జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లా టీడీపీ కార్యాలయం లో ఉమ్మడి. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ కార్యాలయ గురువారం కార్యదర్శి పాలి ప్రసాద్ సంతాప సభ ఏలూరు నియోజకవర్గం ఇంచార్జి బడేటి. రాధాకృష్ణ అధ్యక్షతన జరిగింది. సభ అధ్యక్షులు బడేటి చంటి, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కి. కార్యాలయ కార్యదర్శి గా పనిచేసిన పాలి ప్రసాద్ మరణం పార్టీకి, కుటుంబ సభ్యులకు తీరనిలోటుని అన్నారు. అయన కుటుంబ సభ్యులకు పార్టీ అండదండలు ఉంటాయినిఅన్నారు. పాలి ప్రసాద్ ఉదయం 9 గంటలకు పార్టీ కార్యాలయానికివచ్చి సాయంత్రం వరకు ఆఫీస్ లో జిల్లావ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలలో నిమగ్నమయ్యే వారన్నారు. తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించేవారని పాలి ప్రసాద్ ఎన్టీఆర్ కి అత్యంత ప్రియ శిష్యుడని. అత్యంత ఆప్తుడని కొనియాడారు. జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా మరియు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కి 30 సంవత్సరంలు నుండి కార్యాలయ కార్యదర్శి గా పనిచేసారని. రాష్ట్ర హస్త కళల కార్పొరేషన్ గా పనిచేసి తన సేవలను జిల్లా ప్రజలకు పార్టీకి అందించారన్నారు. ఇంకా ఈ కార్యక్రమం లో ఉంగుటూరు మాజీ శాసనసభ్యులు కొండ్రేడ్డి విశ్వనాధం, ఉప్పాల జగదీష్ బాబు, పట్నాల వెంకటేష్ బాబు, కొక్కిరిగడ్డ జయరాజు, పాకాలపాటి గాంధీ, ఏలూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రెడ్డీ చందు, జగ్గవరపు ముత్తారెడ్డి ఇమ్మణి గంగాధరరావు, సంకా బాలయోగి, కొల్లేపల్లి రాజు పెద్దిబోయిన శివ ప్రసాద్, మాగంటి ప్రభాకర్, కడియాల విజయలక్ష్మి, మాజీ వైస్ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు, రెడ్డి నాగరాజు, కె. శాంతి భూషణం, జంపా సూర్యనారాయణ, దాకారపు రాజేశ్వర్రావు, మల్లెపు రాము అభిమానులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తదితరులు ఈ సంతాప సభలో పాల్గొని తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.