పైపులైన్ పనులు అడ్డుకున్న వ్యాపారస్తులు
1 min readకాంట్రాక్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన షాపు యజమానులు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : తాగునీటి పైపులైన్ కోసం నందికొట్కూరు పట్టణంలోని ప్రధాన రహదారిపై అక్రమంగా చేపట్టిన పైపులైను పనులనుషాప్ యజమానులు అడ్డుకున్నారు. షాప్ యజమానులకు సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు పనులు ఎలా చేపడతారని గురువారం ఆందోళనకు దిగారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించి మున్సిపల్ కమిషనర్ ఏలాంటి అనుమతులు లేకుండా తమ షాప్ లను కూల్చివేశారని నేటికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందలేదన్నారు. ఈ విషయమై యజమానులు కోర్టుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. కేసు హైకోర్టు విచారణలో ఉన్నప్పటికీ ప్రస్తుతం మహేంద్రరెడ్డి అనే కాంట్రాక్టరు జాతీయ రహదారి 340సి స్థలం కాదని తమ స్థలంలో కాలువలు తీస్తున్నారని దుఖాణ యాజమానుల తరుపున కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి అశోక్ రత్నం ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణమే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో వ్యాపారస్తు ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో వ్యాపారస్తులు విజయ భాస్కర్, బాల మురళీధర్, ప్రకాష్ గుప్తా, సురేష్ గుప్తా, వేణు గోపాల్, నజీర్ మియ్య, కృష్ణ కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.