సిద్ధం కాదు యుద్ధం మొదలైంది..!
1 min readస్థానికులు ముద్దు స్థానికేతర్లు వద్దు.
స్థానికేతారులకు బుద్ధి చెప్పాలని దళిత సంఘాలు సిద్ధం.
స్థానికేతారుల ఓటమే లక్ష్యంగా దళిత జేఏసీ ఏర్పాటు..?
నందికొట్కూరు నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికలలో వచ్చే ఫలితాలు రాజకీయ పార్టీలపై తీవ్ర ప్రభావాన్ని చూపించేలా కనిపిస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ చేయించిన సర్వే అయినా లోకల్ అభ్యర్ధి కాకపోతే.. ఆ ఓటు నోటాకి వేస్తామనే వాదనను ఓటర్లు బలంగా తెరమీదకి తీసుకు వస్తున్నారు. ప్రస్తుతం గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్సీపి నుంచి ప్రతిపక్ష టిడిపి వరకూ చాలాస్థానాల్లో నాన్ లోకల్ అభ్యర్ధులనే తెరమీదకు తీసుకు రావడం ఇపుడు చర్చనీయాంశం అవుతోంది. వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రతి గ్రౌండ్ లెవల్ సర్వేలోనూ ఇదే విషయం బయటకు రావడం విశేషం. ము ఖ్యంగా తమ ప్రాంతాలు అభివ్రుద్ధి చెందాలంటే స్థానిక నాయకులు ద్వారా మాత్రమే అది సాధ్య పడుతుందనే విషయాన్ని 70శాతం మంది ఓటర్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రాష్ట్రంలో రాజకీయం అంతా నాన్ లోకల్ అయిపోయిందని, దాని వలన స్థానిక నాయకత్వం పరిస్థితి ఆగం అవుతుందనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నందికొట్కూరులో లోకల్ నాన్ లోకల్ లొల్లి..
నంద్యాల జిల్లా నంద్యాల పార్లమెంట్ పరిధిలోని నందికొట్కూరు నియోజకవర్గంలో రాజకీయం ఉత్కంఠగా మారింది. నందికొట్కూరు అసెంబ్లీ అభ్యర్థిగా వైసీపీ స్థానికులకు కాకుండా స్థానికేతరుడైన కడప వాసి డా. సుధీర్ ధారా కు కేటాయించారు.వైసీపీ అధిష్టానం నిర్ణయం పై నందికొట్కూరు వైసీపీ నాయకులకు సైతం మింగుడు పడడం లేదు.వైసీపీ నాయకులు సైతం అసంతృప్తితో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరు వైసీపీకి సరైన నాయకుడే లేడా అని ప్రశ్నిస్తున్నారు.పార్టీలో సరైన స్థానిక లోకల్ అభ్యర్థి లేకపోతే వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందని నందికొట్కూరు టిక్కెట్ స్థానికులకే ఇవ్వాలనే డిమాండ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అడ్రస్ గల్లంతైతే వైసీపీకి నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థితో పాటు ముఖ్య అధినేతపై కూడా ఆ ప్రభావం పడుతుందని కొందరు వైసీపీ నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటి వరకు పార్టీకి కష్టపడి పనిచేసిన వారికి సరైన గుర్తింపు ఎక్కడా అంటూ ఆశావహులు ప్రశ్నిస్తున్నారు.తాజాగా అభ్యర్థి అంటూ ప్రచారం చేస్తున్నా నేత గతంలో పార్టీకి ఎంత మేరకు సేవ చేశారని ప్రశ్నిస్తున్నారు.
నందికొట్కూరు లో దళిత నిరుద్యోగ జేఏసీ ఏర్పాటు..?
నాన్ లోకల్ వ్యక్తికి టిక్కెట్ కేటాయించడంతో వైసీపీ అధిష్టానంపై నందికొట్కూరు నియోజకవర్గంలోని స్థానిక వైసీపీ నాయకులు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. నందికొట్కూరు టిక్కెట్ కేటాయించేటప్పుడు ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోవటంలో వైఫల్యం ఎవరిదో ప్రజలకు చేరువలో ఉండే నాయకుడు, తమకేదైనా ఇబ్బందులు వస్తే ఆదుకునే నాయకుడు కావాలని నందికొట్కూరు నియోజక వర్గంలోని వైసీపీ నేతలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాల నాయకులు కోరుతున్నారు. కేడర్ కు మనోధైర్యం ఇచ్చే నాయకుడు నందికొట్కూరు నియోజకవర్గంలో లేరా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధిష్టానం పూర్తి స్థాయిలో సర్వే చేసి నందికొట్కూరు (స్థానిక నాయకుడు) వైసీపీలో మంచి ఆదరణ ఉన్న నేతను మాత్రమే పరిగణనలోకి తీసుకుని పార్టీ కేడర్ ను కాపాడాలని కొంతమంది వైసీపీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో నాన్ లోకల్ కు వ్యతిరేకంగా దళిత నిరుద్యోగ జేఏసీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాట్లు సమాచారం.