PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రచారంలో శర వేగంగా దూసుకుపోతున్న ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి

1 min read

కూటమి ప్రభుత్వం అధికారంలోకొస్తే అమలయ్యే పథకాలను వివరిస్తూ పర్యటన

ప్రజా సంకల్ప యాత్రలో టిడిపి అభ్యర్థి బడేటి చంటి ఇంటింటా ప్రచారం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర రక్షణ, జన చైతన్యం స్వేచ్ఛాయుత వాతావరణంతోనే సాధ్యమని, అది కూటమి సమిష్టి విజయంతోనే సాకారమవుతుందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి, జనసేన, బీజేపి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి ధీమా వ్యక్తం చేశారు. తన గెలుపు మార్గాలను సుగమం చేసుకుంటూ తనను నమ్మిన వారికి కూడా అదేరకమైన భరోసా ఇచ్చేందుకు కృషిచేస్తూ తానేంటో నిరూపించుకునే దిశగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నా అన్నారు. కూటమితో ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి ఇప్పటికే నియోజకవర్గాన్ని పలు దఫాలుగా ఇంటింటా చుట్టేసిన ఆయన నియోజకవర్గంలో ప్రతి సమస్య తెలుసుకున్నారు. అదే విధంగా ప్రజా సంకల్పయాత్ర పేరుతో మరో కార్యక్రమాన్ని చేపట్టారు. పాదయాత్రగా నగరంలోని వీధివీధిని ప్రతి కుటుంబాన్ని ఇంటింటికీ వెళ్ళి ప్రతీ ఒక్కరినీ కలుస్తూ తమ ప్రభుత్వం అధికారంలోనికి వస్తే అమలు చేయనున్న పథకాల లబ్దిని ప్రజలకు వివరిస్తూన్నరు. కూటమి కార్యకర్తలతో ప్రచారంలో శర వేగంగా దూసుకుపోతున్నారు. పాలక ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. గురువారం ఏలూరు విద్యానగర్‌లోని 10వ రోడ్డులో చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో టిడిపి, జనసేన నాయకులతో కలిసి బడేటి చంటి పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరిని కలుసుకుని కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వస్తే అమలయ్యే పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును బాధ్యతగా స్వీకరించే కూటమిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత తరుణం ఆసన్నమైందని పునరుద్ఘాటించారు. ప్రతిఒక్కరూ కూటమిని గెలిపించుకునే బాధ్యతను తీసుకోవాలని బడేటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో క్లస్టర్ ఇంచార్జ్ గూడవల్లి వాసు ఆధ్వర్యంలో 23 వ డివిజన్ ఇంచార్జ్ రెడ్డి రామకృష్ణ ,24వ డివిజన్ ఇంచార్జ్ కడియాల విజయలక్ష్మి ,మాజీ ఎంపీపీ మాణిక్యాలరావు ,సోమిశెట్టి రాము ,ఆళ్ళమోహన్ రావు పెద్దిబోయిన శివప్రసాద్ ,రెడ్డి రాంబాబు ,కమిడి రమేష్ ,షేక్ సులేమాన్, చిట్టి బొమ్మ ఫణి,వేమురి శ్రీదర్, బయ్యవరపు కుటుంబరావు ,జంపా నాగేశ్వరరావు ,చేకురి గణేష్,మట్ట రంజిత్,భాష ,రాయించి మురళి,చందు ప్రకాష్,మందపల్లి పాలస్ వివిధ డివిజన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author