ఆశ్రమం ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్
1 min readఫ్రీ ప్లేట్ ప్రెగ్నన్స్ తో గర్భిణీ చేరిక
ముగ్గురు శిశువులకు పునర్జన్మనిచ్చిన డాక్టర్లు
ఆశ్రమంలో అత్యాధునిక పరికరాలు ఉండటంతో నే సులభంతరం
ఆశ్రమం ఆసుపత్రి డాక్టర్లకు జీవితాంతం రుణపడి ఉంటాం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : గత ఫిబ్రవరి 17వ తేదీన ఆశ్రం హాస్పిటల్ లో జ్యోతి అనే 22 సంవత్సరాల గర్భిణీ స్త్రీ 29 వారాల ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ తో ( ముగ్గురు శిశువులు గల గర్భిణీ) ఉమ్మ నీరు కారడంతు బయట నుండి ఆశ్రం హాస్పిటల్లో జాయిన్ అయిందని తెలిపారు. పేషెంట్ ను గైనకాలజిస్ట్ పరిశీలించి హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనగా శిశువులు ఎదురు కాళ్ళతో మరియు నెలలు నిండకపోవడం వలన సిజెరియన్ చేయాలని నిర్ధారించమన్నరు. నిపుణులైన గైనకాలజిస్ట్ డాక్టర్ మరియు అనేస్తేసియా డాక్టర్లు సహకారంతో అవసరమైన అన్నీ పరీక్షలు చేసి ఆపరేషన్ ద్వారా ముగ్గురు ( ఆడపిల్లలు – 2, మగపిల్లాడు – 1) పిల్లలను సురక్షితముగా బయటికి తీసి నిపుణులైన చిన్న పిల్లల డాక్టర్ కి అప్పగించమన్నరు. సుమారు 3 నెలలు ముందుగానే నెలలు నిండకుండా ప్రీమెచ్యూర్ గా పుట్టడం వలన చాలా సమస్యలు వస్తాయని. ఏ సమస్యలు వస్తాయో అని పర్యవేక్షక డాక్టర్లు సిబ్బంది ముందుగ గ్రహించి, ప్రారంభ దశలోనే కనిపెట్ట గలిగితే వారిని మనం రక్షించగలుగుతాము. ఇలా చేయడానికి 24 గంటలు డాక్టర్లు, అనుక్షణం బేబీ యొక్క కండిషన్ పర్యవేక్షణ చేస్తే మనం ఏ సమస్యలు లేకుండా చేయగలమని నిర్ధారించామన్నారు. భవిష్యత్తు లో ఏ సమస్యలు రాకుండా చూడటానికి OAE, BERA అనే వినికిడి పరీక్షలు, ROP స్క్రీనింగ్ అనే కంటి పరీక్షలు చేయడం చాలా అవసరమని. ఇన్ని సదుపాయాలు ఆశ్రమం హాస్పిటల్ లో వుండడం వలన సమగ్రమైన ట్రీట్మెంట్ సమర్థవంతంగా ఆశ్రం నందు ఇవ్వబడుతుందని తెలిపారు. బుధవారం డిశ్చార్జ్ సందర్భముగా గైనకాలజిస్ట్ డాక్టర్ వందన, అనేస్త్సియా డాక్టర్ కుమార్ మరియు పిడియాట్రిక్స్ డాక్టర్ నాగ మీడియాకి వివరించారు. ఇoత వేయప్రాసల కోర్చి తన ముగ్గురు శిశువులకు జన్మనిచ్చిన ఆశ్రమం డాక్టర్లకు సిబ్బందికి జీవితాంతం రుణపడి ఉంటామన్నరు.