ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు
1 min readపల్లెవెలుగు వెబ్ పాణ్యం: పాణ్యం మండలo, స్థానిక ప్రైవేటు స్కూళ్లకు ఒంటి పూట బడులు వర్తించవా ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా స్కూళ్లను రెండు పూటలు నిర్వహిస్తున్న వైనం. స్థానికంగా ఎం ఈ ఓ కి డి ఈ ఓ కళ్ళకు కనిపించక పోవటం గమనార్హం..రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకి ఉష్నోగ్రతలు పెరుగుతున్న ఇక్కడ మాత్రం కలెక్టర్ గారి ఆదేశాలు బేఖాతారు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు.ఈ స్కూళ్ల గుర్తింపు రద్దు చేయాలనీ sfi జిల్లా సహాయ కార్యదర్శి బత్తిని ప్రతాప్ మాట్లాడుతూ కేవలం కాసుల కోసమే అధికారులు పనిచేస్తూ విద్యార్థుల భవిష్యత్తు నాశనానికి పునాది వేస్తున్నారు అలాగే అనుమతి లేని హాస్టల్లు నడుపుతున్నారు కొన్ని సంవత్సరాలుగా కాసులకు కక్కుర్తి పడి, డి ఈ ఓ మరియు ఎం ఈ ఓ లు చూసి చూడనట్టు ప్రవర్తిస్తున్నారు. ఈ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని కోరుతున్నాం ఈ కార్యక్రమం లో మండల నాయకులు రాజు. రవి సునీల్ జయరాం తదితరులు పాల్గొన్నారు.