ఓటింగ్ శాంతాన్ని పెంచే దిశగా చర్యలు చేపడుతున్నాం
1 min readపాణ్యం నియోజకవర్గ ఆర్వో/జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : పాణ్యం నియోజకవర్గంలో ఓటింగ్ శాతాన్ని పెంచే దిశగా స్వీప్ కార్యక్రమాలను చేపడుతున్నామని పాణ్యం నియోజకవర్గ ఆర్వో/జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు.గురువారం కలెక్టరేట్ లోని మిని కాన్ఫరెన్స్ హాల్లో సాధారణ ఎన్నికల నిర్వహణపై మీడియా ప్రతినిధులతో ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని పాణ్యం నియోజకవర్గ ఆర్వో/జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య నిర్వహించారు.ఈ సందర్భంగా పాణ్యం నియోజకవర్గ ఆర్వో / జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ నియోజకవర్గంలో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పాణ్యం నియోజకవర్గం రెండు జిల్లాలలో ఉన్నందున పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్లను కర్నూలు లోనే పాణ్యం నియోజకవర్గం ఆర్వో /జాయింట్ కలెక్టర్ గారు స్వీకరించడం జరుగుతుందన్నారు. పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేయడమైనదని, పాణ్యం నియోజకవర్గనికి సంబంధించిన స్ట్రాంగ్ రూములను మరియు కౌంటింగ్ సెంటర్లను రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. పాణ్యం నియోజకవర్గంలో 3,22,494 మంది ఓటర్లు ఉండగా 1,57,113 మంది పురుషులు,1,65,306 మంది స్త్రీలు, 75 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారన్నారు. ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్స్ ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. 18-19 సంవత్సరాల వయసు కలిగిన యువ ఓటర్లు పాణ్యం నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారని జాయింట్ కలెక్టర్ తెలిపారు. పాణ్యం నియోజకవర్గంలో 149 లొకేషన్ లో 357 పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయని అందులో 214 కల్లూరు, 58 ఓర్వకల్లు, 43 పాణ్యం,42 గడివేములలో ఉన్నాయన్నారు. పాణ్యం నియోజకవర్గంలో 64 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లుగా గుర్తించడం జరిగిందని, పోలింగ్ స్టేషన్లో అదనపు పోలీసు బలగాలు ఉంటాయని, అంతే కాకుండా సీసీ కెమెరాల ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జడ్పీహెచ్ఎస్ స్కూల్ కస్తూరిబా లోని 2 పోలింగ్ స్టేషన్లను, పాలకొల్లులోని ఒక పోలింగ్ స్టేషన్ ను మొత్తం మూడు పోలింగ్ స్టేషన్లను వల్నరబుల్ పోలింగ్ స్టేషన్లు గా గుర్తించడం జరిగిందన్నారు. రాజకీయ పార్టీల వారు వారి ప్రచారానికి ముందస్తు పర్మిషన్ కొరకు అప్లై చేసుకోవాలన్నారు. అప్లై చేస్తే పర్మిషన్ ఇస్తామన్నారు. ఇప్పటికే దాదాపుగా పర్మిషన్ కొరకు 50 మంది అప్లై చేశారని అందులో 38 వరకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. అత్యవసరం అనుకుంటే ఫిజికల్ గా అప్లై చేసిన అనుమతులు ఇస్తామన్నారు. ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. ఏవైనా కంప్లైంట్స్ ఉంటే సి విజిల్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చునన్నారు. కంప్లైంట్ చేసిన 100 నిమిషాల్లోనే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎమ్ సిసి నియమాలను ఉల్లంఘించిన 4 వాలంటీర్లను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు.