సమాజ మార్పే..లక్ష్యం..
1 min readనీతి నిజాయితీ పరులే… నా బలం..
- అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం..
- స్వార్థ రాజకీయాలను తరిమికొడదాం..
- జాతీయ సమ సమాజం పార్టీ వ్యవస్థాపకుడు రామయ్య యాదవ్
- కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి…
కర్నూలు, పల్లెవెలుగు: సమాజంలో పాతుకుపోయిన అవినీతిని తరిమికొట్టేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు జాతీయ సమ సమాజం పార్టీ వ్యవస్థాపకుడు ఎ.పి. రామయ్య యాదవ్. అవినీతి లేని సమాజం నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తానని, ఇందుకు సహకరించాలని కోరారు. కర్నూలు అభివృద్ధి కోసం జేఎస్ఎస్పీ తరుపున అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడ్డానని, తనను ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ఏ.పి. రామయ్య యాదవ్ కోరారు.
జేఎస్ఎస్పీ…నినాదం..:
దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు…వీరులు.. యోధుల పోరాట ఫలమే… మనము స్వేచ్చా స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నామని, కానీ దేశంలో వేళ్లూనుకున్న అవినీతిని ఎండగట్టలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు ఏ.పి. రామయ్య యాదవ్. అవినీతి లేని సమాజం కోసమే తాను జాతీయ సమ సమాజ పార్టీని స్థాపించానని పేర్కొంటున్న ఆయన…. యువతలో స్వార్థరాజకీయాలపై అవగాహన పెంచేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నానన్నారు.
మా బలం…బలగం..:
అవినీతిపై పోరాటే నిజాయితీ పరులే తమ పార్టీ బలం అని… బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలే తన బలగం అని పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు సంక్షేమ.. అభివృద్ధి ఫలాలు అందించడంతోపాటు రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు.
కొత్త వారిని… ఆదరించండి…:
స్వార్థ రాజకీయం.. కుటుంబ పాలనతో విసుగు చెందిన ప్రజలు… కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని రామయ్య యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ నాయకులు అవినీతిలో కూరుకుపోయాయని, ప్రజలకు సుపరిపాలన అందించేందుకు జాతీయ సమ సమాజం పార్టీ స్థాపించానని, రాజకీయాలపై ఆసక్తి ఉన్న యువకులు తమ పార్టీలో చేరాలని అభ్యర్థించారు.
కర్నూలు నుంచి.. బరిలోకి…:
రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలు… స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అభివృద్ధిలో వెనుకబడి ఉందని, నగర అభివృద్ధికి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని జేఎస్ఎస్పీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఏ.పి. రామయ్య యాదవ్ కోరారు. తనకు అవకాశం ఇస్తే… కర్నూలులో పరిశ్రమలు తీసుకొస్తానని, ప్రగతిలో పరుగులు పెట్టిస్తానన్నారు.
యువతకు..ఉపాధి..:
రాయలసీమలో ఉపాధి లేక ప్రజలు, యువత బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబాయి వంటి నగరాలకు వలస వెళ్తున్నారని, ఇక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వలసలు ఆపినట్లవుతుందని, కానీ ఆదిశగా నాయకులు ఎవరూ పని చేయడంలేదని రామయ్య యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే… కర్నూలులో పరిశ్రమలు తీసుకొచ్చి.. యువతకు ఉపాధి కల్పిస్తానన్నారు. వలసలు ఆపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
వృద్ధులకు.. రైతులకు….భరోసా…:
కర్నూలు సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే… నగరంలో అనాథలకు… వృద్ధులకు ఆశ్రమాలు కట్టిస్తానన్నారు. అలాగే రైతులకు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన సరైన గిట్టుబాటు ధర, విపత్తుల సమయంలో నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటామని ఏ.పి. రామయ్య యాదవ్ హామీ ఇచ్చారు. కర్నూలు ప్రజలు తనను ఆశీర్వదించి… గెలిపించాలని ఈ సందర్భంగా జేఎస్ఎస్పీ వ్యవస్థాపకుడు రామయ్య యాదవ్ కోరారు.