ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి – సబ్ జైల్ సూపరింటెండెంట్ చంద్ర మోహన్
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ : రిమాండ్ లో ఉన్న ఖైదీలు బయటకు వెళ్ళిన తర్వాత నేరాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో మెలగాలని సబ్ జైల్ సూపరింటెండెంట్ చంద్ర మోహన్ సూచించారు. శుక్రవారం పత్తికొండ పట్టణంలోని సబ్ జైల్ లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోషల్ ఇన్ క్యూబేషన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పుట్టుకతో ఎవరూ నేరస్తులు కాదు అన్నారు. పరిస్థితుల ప్రభావం, కోపం, పగ, క్షణికా వేషాలతో నేరాలకు పాల్పడటం వల్ల వారి కుటుంబాలు నాశనం అవుతాయన్నారు. సన్మార్గం లో నడవాలని, సామాజిక బాధ్యతతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమం లో బార్ అసోసియేషన్ ప్రథాన కార్యదర్శి బి. రంగస్వామి, సామాజిక సేవకులు వెంకటేశ్వర్లు, రాజు, సబ్ జైల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.