కర్నూలుకు 20 ఏళ్ల అభివృద్ధి అందిస్తా.. కర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భరత్
1 min readఎన్.ఆర్ పేటలో పార్టీ చేరికల కార్యక్రమం
ఎమ్మెల్యే, ఎంపీ రెండు ఓట్లు సైకిల్‌కే వేయాలన్న టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తనను గెలిపిస్తే ఐదేళ్లలో కర్నూలు ప్రజలకు 20 ఏళ్ల అభివృద్ధి అందిస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ అన్నారు. గురువారం రాత్రి నగరంలోని ఎన్.ఆర్ పేటలో నిర్వహించిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యువకులకు ఆయన కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వాన్ని గెలిపించి ఐదేళ్ల భవిష్యత్తు నష్టపోయారని.. మరో ఐదేళ్లు కోల్పోవద్దన్నారు. తాను స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాల్లోలేనని భరత్ తెలిపారు. కేవలం ప్రజాసేవ కోసమే పరితపిస్తున్నట్లు చెప్పారు. తాను గెలిచాక కర్నూలుకు పరిశ్రమలు తీసుకొస్తానని భరోసా ఇచ్చారు. ఒక్క పరిశ్రమ వచ్చినా యువత భవిష్యత్తుకు మంచి మార్గం దొరుకుతుందన్నారు. దీంతో పాటు కర్నూల్లోని అందరి వ్యాపారాలు పెరుగుతాయని.. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కులం, మతం చూడకుండా తనను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. తెలుగుదేశం పార్టీ గెలిస్తే ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ఉంటాయన్నారు. తమ పార్టీ తీసుకొచ్చిన సూపర్ 6 పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ రెండు మిషన్లలో సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. కొందరు స్వార్థ పరులు ఒక్క ఓటు మాత్రమే సైకిల్‌కు వేసి ఇంకో ఓటు వారి పార్టీ గుర్తుకు వేయాలని మాయలోపడేసే యోచనలో ఉన్నట్లు తెలిసిందన్నారు. అలాంటి స్వార్థపు వ్యక్తుల మాయలోపడొద్దని కోరారు. పార్టీలో చేరిన వారిలో రెహ్మత్ ఖాన్, రఘు, విజయ్, సాయి, బాలు, రహీమ్, యాస్మిన్, కళ్యాణ్ సింగ్, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జి విక్రమ్ సింగ్, కల్కూర చంద్రశేఖర్, అనురాధ, చంద్రశేఖర్, శంకర్ సింగ్, నాగేంద్ర, అన్వర్, చంద్రకాంత్, మణి ప్రకాష్, భాస్కర్, సాయి, లక్ష్మన్న, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.