కుమ్మరి రేవు మంచినీటి సమస్యను పరిష్కరించండి..
1 min readసిపిఎం డిమాండ్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు నగరం 29వ డివిజన్ కుమ్మరి రేవు ప్రాంతంలో గత 20 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్న పేద ప్రజల దాహార్తిని తీర్చాలని సిపిఎం ఏలూరు నగర నాయకులు బి సోమయ్య, జె గోపి డిమాండ్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఏలూరు నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట కుమ్మరి రేవు ప్రాంత మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు. వేసవికాలం రాకముందే గత నెల రోజులుగా మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నామని, మున్సిపల్ కుళాయిలు ఉన్న మంచినీరు రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కుమ్మరి రేవు మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని, ఎటుగట్టు ప్రాంతంలోనే దాదాపు 200 కుటుంబాలకు మంచినీళ్లు దొరకడం లేదని ట్యాంకర్ల ద్వారా నైనా మంచినీటి అందించాలని కోరారు. ధర్నా అనంతరం ఏలూరు నగర పాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కమిషనర్ స్పందిస్తూ కుమ్మరి రేవు ఏటిగట్టు ప్రాంతంలో బోర్ వెల్ వేస్తామని, కుమ్మరి రేవు ప్రాంతానికి ట్యాంకర్ల ద్వారా తాత్కాలికంగా మంచినీటి సరఫరా అందిస్తామని హామీ ఇచ్చారు. రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లకు వీలైనంత త్వరగా నే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంచినీటి కోసం చేపట్టిన ధర్నాకు జి ఏసుబాబు, సిహెచ్ కళావతి, కే అప్పల నరసమ్మ, కే సావిత్రి, కే బేబీ నాయకత్వం వహించారు.