PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పదిమంది తల సేమియా చిన్నారులకు రక్తమార్పిడి..

1 min read

ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తం దానం చేయండి

రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి

30 మంది సహాయకులకు ఉచిత భోజనం

లైన్స్ గవర్నర్ కాకరాల వేణు బాబు ఏర్పాటు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న  రెడ్ క్రాస్ తల సేమియా రక్త మార్పిడి కేంద్రంలో 10మంది తలసేమియా చిన్నారులకు రక్తమార్పిడి చికిత్స నిర్వహించినట్లు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ  సాధారణంగా తల సేమియా చిన్నారులకు నెలకు రెండు నుంచి మూడుసార్లు రక్తమార్పిడి చేయించుకోవలసి ఉంటుందని, కానీ కొంతమందికి తగినంత హిమోగ్లోబిన్ పెరగటం లేదని అందువలన వారికి తరచుగా రక్త మార్పిడి చేస్తున్నామని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం వలన మాత్రమే వారిని ఆదుకోగలమని అన్నారు. ఈరోజు తల సేమియా చిన్నారులతోపాటు వారి సహాయకులకు 30 మందికి ఉచిత భోజనాన్ని లయన్స్ 1st వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కాకరాల వేణు బాబు ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి కేబీ సీతారాం, డాక్టర్ వర ప్రసాదరావు, డాక్టర్ పి ఎ ఆర్ ఎస్ శ్రీనివాసరావు, గౌరవ కార్యదర్శి కడియాల కృష్ణారావు, మానవతా సభ్యులు అడుసుమిల్లి నిర్మల, రత్నాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

About Author