44వ బిజెపి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
1 min readపోలవరం నుండి కైకలూరు వరకు బిజెపి నేతలు కార్లతో ర్యాలీ..
బిజెపి కార్ల ర్యాలిని ప్రారంభించిన గారపాటి చౌదరి
పెద్ద ఎత్తున పాల్గొన్న బిజెపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు
పలుచోట్ల జండాఆవిష్కరణలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా భారత్ ను తీర్చిదిద్దిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతోంది అని, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు గా గత పది సంవత్సరాల బిజెపి పాలన సాగింది అని బిజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి అన్నారు. 44వ బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో పోలవరం నుండి కైకలూరు వరకు భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. శనివారం ఉదయం పట్టిసీమ లోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారిని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ తోపాటు జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన బిజెపి నాయకులు, కార్యకర్తలు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోలవరంలో బిజెపి స్తూపం వద్ద పార్టీ జెండాను జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్ ఆవిష్కరించగా బిజెపి నాయకులు, కార్యకర్తలతో భారీ కార్ల ర్యాలీనీ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గారపాటి చౌదరి మాట్లాడుతూ దేశంలో బిజెపి అతిపెద్ద పార్టీ అని గత పది సంవత్సరాల్లో ప్రపంచ దేశాలకు పోటీగా భారత్ ను అన్ని రంగాల్లో మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అభివృద్ధి చేసిందన్నారు. పోలవరం నుండి ప్రారంభమైన కార్ల ర్యాలీ కన్నాపురం, కొయ్యలగూడెం జంగారెడ్డిగూడెంతోపాటు ఏలూరు మీదుగా కైకలూరు వరకు ర్యాలీ సాగింది. మార్గమధ్యలో మద్ది ఆంజనేయ స్వామి వారిని బిజెపి నేతలు దర్శించుకున్నారు. పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఏలూరు, పాత బస్టాండ్, వసంత మహల్ సెంటర్ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా జిల్లా బిజెపి కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. కైకలూరు నియోజకవర్గల పరిధిలో ఈ ర్యాలీ నిర్వహించగా ఐదు ప్రాంతాల్లో బిజెపి జెండా స్థూపాన్ని ఆవిష్కరవచ్చారు. ర్యాలీ లో బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల కిషోర్, పార్లమెంట్ కన్వీనర్ కృష్ణ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ శరణాల మాలతి రాణి, దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ గుమ్మడి చైతన్య, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఏసుబాబు, ఏలూరు కన్వీనర్ గాది రాంబాబు, పోలవరం నియోజకవర్గ కన్వీనర్ రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శిలు నడపన ధనభాస్కర్, నగడపాటి సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు కర్రిబండి నాగరాజు, పలువురు మండలాధ్యక్షులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గఅన్నారు.