నగరానికి దాహార్తి తీర్చేందుకు కేసీ కెనాల్ ద్వారా పరుగులు పెడుతున్న గంగమ్మ
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: కడప నగరానికి ప్రజల దాహార్తి తీర్చేందుకు గండికోట. మైలవరం జలాశయం నుంచి పెన్నా నది ద్వారా వదిలిన నీరు పెన్నా నది పై నిర్మించిన ఆది నిమ్మాయిపల్లి ఆనకట్ట వద్ద చేరుకోగా అక్కడ నుంచి కడప కేసీ కెనాల్ మెయిన్ కాల్వ ద్వారా వీటిని వదలగా ఫాతిమా మెడికల్ కాలేజీ వెనుక భాగంలో కెనాల్ కాలవ నుంచి చింతల వంకకు నుంచి రాళ్ల వంక ద్వారా చెన్నూరు మండలం రాచినాయిపల్లి గ్రామ వద్ద బుగ్గ వంక ద్వారా ఓబులంపల్లి గ్రామ సమీపంలో ఉన్న బుగ్గ వంక నుంచి పెన్నా నదిలోకి మళ్ళించారు. కడప నగరానికి దాహార్తి కోసం వాటర్ గండి వద్ద ఏర్పాటుచేసిన పంపింగ్ స్కీం వరకు నీరు చేరాయి. అక్కడ నుంచి పెన్నా నది ద్వారా సిద్ధవటం మండలం లింగంపల్లి వద్ద కడప నగరానికి దాహార్తి కోసం నిర్మించిన వాటర్ గండి పంపింగ్ స్కీం వరకు నీరు పరుగులు పెడుతుంది. గత వారం రోజుల నుంచి ఆది నిమ్మాయపల్లి ఆనకట్ట నుంచి నీటి సరఫరా జరుగుతున్నది. కడప జిల్లా కలెక్టర్ ప్రత్యేక సొరవ తీసుకోగా కడప కార్పొరేషన్ అధికారులు అవినీమాయపల్లి ఆనకట్ట కేసీ కెనాల్ అధికారులు పర్యవేక్షణలో నీటి సరఫరా జరుగుతున్నది. ఆది నిమ్మాయిపల్లి ఆనకట్ట నుంచి కేసి కెనాల్ వంకల ద్వారా సరఫరా అవుతున్న నీటిని ఎవరు వాడుకోకుండా ప్రత్యేక నిగా పెట్టారు. ఆదినిమాయపల్లి ఆనకట్ట కేసీ కెనాల్ ఇంజనీరింగ్ అధికారి. జమాలవల్లి మాట్లాడుతూ మైలవరం జలాశయం నుంచి వస్తున్న నీరు 140 నుంచి 160 క్యూసెక్కుల వరకు విడుదల అవుతున్నదని సరఫరా అవుతున్న నీటిని కేసీ కెనాల్ కాల్వ ద్వారా వంకలకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. అక్కడ నుంచి కడప వాటర్ గండి. లింగంపల్లి వాటర్ కండి వరకు నీరు చేరుకుంటుందన్నారు.