నేడు చెన్నూరులో గంగమ్మ జాతర
1 min readజాతర నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి
సీఐ పార్థసారథి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండల కేంద్రమైన చెన్నూరు బస్టాండ్ సమీపంలో పీర్ల సావిడి వద్ద ఆదివారం నిర్వహించ తలపెట్టిన శ్రీశ్రీశ్రీ గంగమ్మ జాతరను నిర్వహించేందుకు కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఉదయం నుంచి గంగమ్మ. పెద్దమ్మ అమ్మవార్లను ఏర్పాటు చేసేందుకు మందిరాలు ఏర్పాటు చేసి దారి పొడవునా సల్వా పందిర్లు ఏర్పాటు చేశారు. జాతర జరుగుతున్న ప్రాంతాన్ని సీఐ పార్థసారథి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. సీఐ వెంట పోలీసులు ఉన్నారు. శనివారం అర్ధరాత్రి నుంచి జాతర మహోత్సవం మొదలవుతుంది. గొల్ల పుల్లయ్య గారి వీధిలో గంగమ్మ పెద్దమ్మ మట్టి విగ్రహాలను కుమ్మర్ల చేత తయారు చేయించి అక్కడ ప్రత్యేక అలంకరణతో జాతర జరిగే ప్రాంతం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవార్లకు జంతుబలులు సమర్పించుకుంటారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుకుంటూ భారీ తప్పెట్లు వాయిద్యాల మధ్య గంగమ్మ పెద్దమ్మ జరిగే ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ మందిరాలు ఉన్న ప్రాంతంలో అమ్మవార్లను ఏర్పాటు చేసిన అనంతరం ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి జంతుబలులు బోనాలు పెద్ద ఎత్తున సమర్పిస్తారు. సాయంత్రం మూడు గంటల నుంచి జాతర జరిగే ప్రాంతంలో తిరుణాల మహోత్సవం నిర్వహిస్తారు. గంగమ్మ పెద్దమ్మ అమ్మవాళ్ళను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున మహిళలు బోనాలతో అక్కడికి చేరుకుంటారు. శనివారం జాతర నిర్వహించే కమిటీ సభ్యులు చెన్నూరు సర్పంచ్. వెంకటసుబ్బయ్య( కళ్యాణ్) ముదిరెడ్డి సుబ్బారెడ్డి. శివారెడ్డి. యోగేశ్వర్ రెడ్డి. రమేష్. డీలర్ శ్రీనివాసులు. జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు.
గంగమ్మ జాతర ఉత్సవాలలో భాగంగా బండలాగుడు పోటీలు
గంగమ్మ జాతర ఉత్సవాలలో భాగంగా చెన్నూరు కొత్త రోడ్డు దగ్గరలోని ఆసనం వద్దఆదివారం ఉదయం 8 గంటల నుంచి న్యూ కేటగిరి వృషభ రాజములచే బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు మరో కమిటీ సభ్యులు తెలిపారు. మొదటి బహుమతి 40 వేల రూపాయలు రెండవ బహుమతి 30 వేల రూపాయలు మూడో బహుమతి 20 వేల రూపాయలు నాలుగో బహుమతి పదివేల రూపాయలు ఐదవ బహుమతి 5000 రూపాయలు నిర్ణయించారు. పోటీలలో పాల్గొ దలచినవారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని కమిటీ సభ్యులు కోరారు.