PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లయన్స్ క్లబ్స్ ద్వారా విస్తృత సేవా కార్యక్రమాలు చేపట్టాలి

1 min read

లయన్స్  పాస్ట్ డిస్టిక్  గవర్నర్ లయన్ చంద్రప్రకాష్.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ సేవా కార్యక్రమాలు అభినందనీయమని లయన్స్ జిల్లా పాస్ట్ డిస్టిక్ గవర్నర్ లయన్ చంద్రప్రకాష్ అన్నారు. ఆదివారం ప్రొద్దుటూరులో జరిగిన 2022 -23 సంవత్సరానికి గాను విశిష్ట సేవలు అందించిన లయన్స్ క్లబ్ లకు అవార్డుల కార్యక్రమంలో ఆ సంవత్సరానికి గాను లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్  మెల్విన్   జోన్స్ ప్రతినిధిగా డాక్టర్ రాయపాటి శ్రీనివాస్  కు జిల్లా గవర్నర్ ఏరియా  రిప్రజెంటిటేటివ్ గా ఉత్తమ సేవా  అవార్డును జిల్లా గవర్నర్ లయన్ చంద్రప్రకాష్ మరియు ఇతర పాస్ట్  డిస్టిక్ గవర్నర్ల  గవర్నర్ల చేతుల మీదుగా అందజేశారు .సందర్భంగా అవార్డు గ్రహీత డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ లయన్స్ అవార్డు స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరింప చేస్తామన్నారు.

About Author