PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యాద‌వుల సంక్షేమం, అభివృద్ధి కోసం టిడిపి కృషి చేస్తుంది..

1 min read

క‌ర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భ‌ర‌త్

ప‌రిణ‌యహాల్‌లో క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ‌ యాద‌వుల ఆత్మీయ స‌మావేశం

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాష్ట్రంలోని యాద‌వుల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంద‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని మౌర్య ఇన్‌లోని ప‌రిణ‌యహాల్‌లో నిర్వహించిన క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ‌ యాద‌వుల ఆత్మీయ స‌మావేశంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ టిడిపికి మ‌ద్దతిచ్చేందుకు యాద‌వులు ముందుకు రావ‌డం సంతోషించే విష‌య‌మ‌న్నారు. క‌ర్నూలు రాజ‌కీయాల్లో నిస్వార్థంగా సేవ చేస్తోంది తమ టి.జి కుటుంబ‌మే అని ఆయ‌న తెలిపారు. క‌ర్నూలు అభివృద్ధి కోసం తాను క‌ట్టుబ‌డి ఉన్నాన‌న్నారు. ఒక్కసారి త‌న‌కు ఎమ్మెల్యేగా అవ‌కాశం ఇవ్వాల‌ని ఆయ‌న‌ కోరారు. తాను ఒక్కసారి మాటిస్తే త‌ప్పే వ్యక్తిని కాద‌ని టి.జి భ‌ర‌త్ పేర్కొన్నారు. క‌ర్నూల్లో యాద‌వ భ‌వ‌న్ నిర్మాణానికి త‌గిన విధంగా కృషి చేస్తానన్నారు. క‌ర్నూల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న 10 వేల మంది యాద‌వులు మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల‌ని కోరారు. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు యాద‌వులు క‌లిసిక‌ట్టుగా నిర్ణయం తీసుకోవాల‌న్నారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయ‌క‌త్వం చాలా అవ‌స‌ర‌మ‌న్నారు. అన్నివిధాలా ఇబ్బందుల్లో ఉన్న ప్రస్తుత ప‌రిస్థితుల్లో టిడిపి ప్రభుత్వం వ‌స్తేనే మ‌ళ్లీ రాష్ట్రం గాడిలో ప‌డుతుంద‌ని చెప్పారు. చంద్రబాబు నాయుడుపై ఉన్న న‌మ్మకంతో రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు త‌ర‌లివ‌స్తార‌ని భ‌ర‌త్ పేర్కొన్నారు. యువ‌త‌కు మంచి భ‌విష్యత్తు ఇచ్చేందుకు టిడిపి క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు.అనంత‌రం యాద‌వ కుల పెద్దలు మాట్లాడుతూ.. స‌మాజం అభివృద్ధి చెందాలంటే క‌ర్నూల్లో టి.జి కుటుంబం రాజ‌కీయాల్లో ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. టి.జి వెంక‌టేష్ అధికారంలో ఉన్నప్పుడు న‌గ‌రాన్ని ఎంతో అభివృద్ధి చేశార‌ని తెలిపారు. ప్రజ‌ల త్రాగునీటి క‌ష్టాలు తీర్చేందుకు ఆయ‌న ఎంతో కృషి చేశార‌ని కొనియాడారు. టి.జి భ‌ర‌త్‌ను రానున్న ఎన్నిక‌ల్లో గెలిపిస్తే మ‌ళ్లీ అభివృద్ధి ప‌రుగులు పెడుతుంద‌న్న న‌మ్మకం త‌మ‌కు ఉంద‌ని తెలిపారు. నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తులు రాజ‌కీయాల్లో చాలా అరుదుగా ఉంటార‌న్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి న‌గ‌ర అధ్యక్షుడు నాగ‌రాజు యాద‌వ్, జ‌నసేన ఇంచార్జి అర్షద్, తెలుగుయువ‌త రాష్ట్ర ప్రధాన కార్యద‌ర్శి ల‌క్కీటూ గోపినాథ్‌ యాద‌వ్, విజ‌య‌ల‌క్ష్మి, యాద‌వ సంఘం జిల్లా అధ్యక్షులు అయ్యన్న యాదవ్, శ్రీరాములు, జె.వి క్రిష్ణయ్య‌, డాక్టర్ బాల‌మద్దయ్య‌, డాక్టర్ చంద్రశేఖ‌ర్‌, రాజు యాద‌వ్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author