NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాటు సారా స్థావరాల పై మెరుపు దాడులు

1 min read

1500 లీటర్లు ఊట ధ్వంసం.. 10 లీటర్లు సారా స్వాధీనం
పల్లెవెలుగు రాయచోటి/వీరబల్లి : వీరబల్లి మండలంలోని తాటికుంటపల్లె పంచాయతీ నాయినివారిపల్లె సమీపంలోని మామిడితోటల్లో అక్రమంగా నాటు సారా కాస్తున్న స్థావరాల పై మంగళవారం వీరబల్లి ఎస్ఐ మహమ్మద్ రఫీ తన సిబ్బంది కలిసి మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో 1500 లీటర్లు నాటు సారా ఊటను ధ్వంసం చేసి 10 లీటర్లు నాటు సారాను స్వాధీనం చేసుకొని చిట్రారాజు వెంకటమల్లయ్య అనే నిందితుడిని అరెస్ట్ చేయగా దుర్గం క్రిష్ణయ్య, వెంకటరమణ, రామయ్య అనే ముగ్గురు నిందితులు పరారీ అయినట్లు ఎస్ఐ తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితుడుని రిమాండ్ కు హాజరు పరుస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ దాడుల్లో ఏఎస్ఐ రమేష్ బాబు, పోలీసు సిబ్బంది చంద్రశేఖర్, మల్లికార్జున, కరిముల్లా, ఖాదర్ వలీ, సిపిఓలు రమణ, నరసింహా లు పాల్గొన్నారు.

About Author