బయ్యారపు శ్రీనివాస్ 60 మంది నిరాస్రాయులకు భోజన సదుపాయం
1 min readపాల్గొన్న ఏపీ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు నగరంలో స్థానిక పత్తేబాద వద్ద రైతు బజారు వెనుక ఉన్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఉంటున్న సుమారు 60 మంది నిరాశ్రయులకు ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న బయ్యారపు శ్రీనివాస్ సోమవారం భోజన సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవసేవయే మాధవ సేవ అని మనం ఎంత సంపాదించుకున్న తమకున్న దానిలో కొంత సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తే మనశ్శాంతి, సంతృప్తి కలుగుతుందన్నారు. నిరాశ్రయులైన వారికి భోజన సదుపాయం చేయడంలో ఉన్న ఆనందం మరి దేనిలో కలుగదన్నరు. నిరాశ్రయులకు స్వయంగా వడ్డించారు, మెప్మా వారి ద్వారా వారికి రావాల్సిన రాయితీలను ఇప్పించే విషయం లో కృషి చేస్తామని. అదే విధంగా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ తరపున వారికి ఎటువంటి సమయంలో ఏ విధమైన అవసరం ఏర్పడినా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ ఎన్జీజీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అని తోటి మనిషికి ఆకలి తీర్చడంలో సాక్షాత్తు ఆ భగవంతుని కి మనం సేవ చేసినట్లే అవుతుందన్నారు. నిత్యజీవితంలో మనం ఎంత శ్రమించినా సమయానికి పిడికెడు అన్నం తింటే నే ఆకలి తీరుతుంది అన్నారు. వయసు పైబడిన వారు, నిరస్రాయలు ఆశ్రమాలలో ఎంతోమంది ఉంటున్నారని సాటి మనిషిగా మనం వారికి సమయానికి పట్టెడు అన్నంతో ఆకలి తీర్చే సదుపాయాన్ని కలిగిస్తే ఆ దైవనికి సేవ చేసినట్లేనన్నారు. శ్రీనివాస్ వారికి భోజనం అందించారు.