PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భరోసా కల్పిస్తాం… ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

1 min read

కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ . ప్రశాంత ఎన్నికలే లక్ష్యం.

జిల్లాలోని పలు ప్రాంతాలలో  కేంద్ర సాయుధ బలగాల తో పోలీసుల కవాతు.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు కవాతు నిర్వహించారని కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్   సోమవారం ఒక ప్రకటనలో  తెలిపారు.సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసులు ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి  కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో  కవాతు నిర్వహించారన్నారు.ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని జిల్లా ప్రజలకు  జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎన్నికలలో ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా దానికి జిల్లా పోలీసు యంత్రాంగం సహకారం ఎల్లవేళలా ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గ తెలిపారు.ఈ రోజు జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు జిల్లాలోని  కర్నూలు,  పత్తికొండ , ఎమ్మిగనూరు  సబ్ డివిజన్ లలోని పలు ప్రాంతాలలో కేంద్ర సాయిధ బలగాలైన “సశస్త్ర సీమా బల్”  సిబ్బందితో కలిసి పోలీసులు కవాతు నిర్వహించారు. ఓర్వకల్లు  పోలీసుస్టేషన్ పరిధిలోని ఓర్వకల్లు, లొద్దిపల్లె, కొంతలపాడు, ఉప్పలపాడు, మీదివేముల  గ్రామాలలో   కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు.కర్నూలు రూరల్ సిఐ కిరణ్ కుమార్ రెడ్డి ,  ఓర్వకల్లు  ఎస్సై  రాజారెడ్డి  పాల్గొన్నారు. క్రిష్ణగిరి  పోలీసుస్టేషన్ పరిధిలోని పందిరాళ్ళపల్లె, లక్కసాగరం, సంగాల, అమకతాడు, పుట్లూరు  గ్రామాలలో  కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు. వెల్దుర్తి  సిఐ సురేష్ కుమార్ రెడ్డి , క్రిష్ణగిరి ఎస్సై  చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మిగనూరు  టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోని  ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప నగర్ లో  కేంద్ర సాయుధ బలగాలతో  పోలీసులు  కవాతు నిర్వహించారు.ఎమ్మిగనూరు టౌన్ సిఐ  మధుసుధన్ రావు,   ఎస్సై  రమేష్ బాబు  పాల్గొన్నారు.

About Author