PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రక్తనాళాలు మూసుకుపోతే.. ‘బైపాస్​’ తప్పనిసరి..!

1 min read

బైపాస్​ సర్జరీతో.. హార్ట్​కు రక్తసరఫరా సులభం…

  • బైపాస్​ తరువాత.. ఆరోగ్య నియమాలు పాటించాల్సిందే..
  • మద్యం,ధూమపానంకు దూరంగా ఉండాలి
  • డా. లక్ష్మణ స్వామి, కార్డియో వ్యాసక్యులర్​ సర్జన్​

కర్నూలు, పల్లెవెలుగు:గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు మూసుకుపోతే… అత్యవసరంగా ప్రాణాలు కాపాడేందుకు చేసే శస్ర్తచికిత్స పేరు బైపాస్​ సర్జరి. దీనిని కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ (CABG) అని కూడా పిలుస్తారు. ఇది తీవ్రమైన గుండె జబ్బులతో బాధపడుతున్న చాలా మంది వ్యక్తులకు ప్రాణదాతగా మారిన వైద్య ప్రక్రియ. బైపాస్​ సర్జరితో రక్తం మరింత సులభంగా గుండె కండరాలకు చేరుతుందని వెల్లడించారు డా. లక్ష్మణ స్వామి, కార్డియో వ్యాసక్యులర్​ సర్జన్.ఆదివారం కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ కార్యాలయంలో విద్యార్థులకు హార్ట్​ బైపాస్​ సర్జరీ పై అవగాహన సదస్సు నిర్వహించారు. హార్ట్​ ఫౌండేషన్​ ప్రధాన కార్యదర్శి, సీనియర్​ కార్డియాలజి, హార్ట్​ అండ్​ బ్రేన్​ మల్టీ సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్​ అధినేత డా. చంద్రశేఖర్​ అధ్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సుకు  ప్రముఖ కార్డియా వ్యాసక్యులర్​ సర్జన్​ డా. లక్ష్మణ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా డా. లక్ష్మణ స్వామి మాట్లాడుతూ ఆధునిక సమాజంలో వయసుతో సంబంధం లేకుండా… ప్రతిఒక్కరు గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నారు.  ప్రతి రోజు వ్యాయామం చేయకపోవడం… ఆహార నియమాలు పాటించకపోవడం… ఫాస్ట్​ఫుడ్​కు అలవాటు పడటం, చెడు అలవాట్లకు బానిస కావడంతో  గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి.  

బైపాస్ సర్జరీ అంటే ఏమిటి?

బైపాస్ సర్జరీ.. తరచుగా హార్ట్ బైపాస్ సర్జరీ అని పిలుస్తారు, ఇది కరోనరీ ఆర్టరీ డిసీజ్ (CAD) చికిత్సకు ఉపయోగించే శస్త్రచికిత్సా ప్రక్రియ. ఈ స్థితిలో, గుండెకు ఆక్సిజన్ సరఫరా చేసే రక్త నాళాలు ఇరుకైనవి లేదామూసుకుపోయి ఉంటాయి.  దీంతో గుండె నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. శస్త్రచికిత్స సమయంలో శస్త్రవైద్యుడు శరీరంలోని ఇతర భాగాల నుండి ఆరోగ్యకరమైన రక్తనాళాలు లేదా కృత్రిమ అంటుకట్టుటలను ఉపయోగించడం ద్వారా గుండె కండరాలకు రక్తం ప్రవహించడానికి కొత్త మార్గాలను సృష్టిస్తాడు. ఇలా చేయడం ద్వారా, శస్త్రచికిత్స నిరోధించబడిన లేదా ఇరుకైన ధమనులను దాటవేస్తుంది, రక్తం మరింత సులభంగా గుండె కండరాలకు చేరుకోవడానికి అనుమతిస్తుంది.

గుండె నొప్పికి… కారణాలు..:

ప్రతి రోజు వ్యాయమం చేయకపోవడం… నడకలేకపోవడం… తగిన ఆహార నియమాలు పాటించకపోవడం.. మద్యం, పొగ తాగడం వంటి చెడు అలవాట్లకు బానిస అయిన వారికి ఛాతి లేదా గుండె నొప్పి వచ్చే అవకాశం ఉంది. మనిషి తాను తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. శరీరంలో కొవ్వు పేరుకుపోతే…. రక్తనాళాలు మూసుకుపోయే అవకాశం అధికంగా ఉంటుంది. దీంతో గుండె కండరాలకు  రక్తం సరఫరాలో అడ్డంకులు ఏర్పడతాయి. దీన్ని క్లియర్​ చేయడానికి బైపాస్​ సర్జరీ చేస్తారు.

‘బైపాస్​’ తరువాత… ఆరోగ్యంగా ఉండాలంటే….:

 హార్ట్ బైపాస్​ సర్జరీ తరువాత మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే…. ఆహార నియమాలు పాటించాల్సిందే. ప్రతి రోజు వ్యాయమం చేయాల్సిందే. చెడు అలవాట్లకు దూరంగా ఉంటే మంచిది.  బైపాస్ సర్జరీ చేయించుకున్న వారు గుండె వైద్య నిపుణులు సూచించినట్లుగా మందులు వాడాలి. సదరు వైద్యుడికి అందుబాటులో ఉండండి. ఛాతిలో కొద్దిగా నొప్పి వచ్చినా… గుండె వైద్యులను కలిస్తే మంచిది.

About Author