చండ్ర రాజేశ్వరరావు 30వ వర్ధంతి
1 min readసిఆర్ సేవాసమితి ఆధ్వర్యంలో వృద్ధులకు వృద్ధాశ్రమంలో పండ్లు. బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగినది
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్వాతంత్ర సమరయోధు లు కమ్యూనిస్టు పార్టీ నిస్వార్థ సేవకుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు 30వ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగిన ది ఈ సందర్భంగా కర్నూల్ నగరంలోని చండ్ర రాజేశ్వరరావు చిత్రపటానికి సి ఆర్ భవన్ లో పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో సిఆర్ సేవాసమితి అధ్యక్షులు కే జగన్నాథం సిపిఐ నగర కార్యదర్శిపి రామకృష్ణారెడ్డి సిపిఐ నగర సహాయ కార్యదర్శి సి మహేష్ నగర కార్యవర్గ సభ్యులు యు నాగరాజు చిత్రపటానికి పూలమాల వేసిన వారిలో ఉన్నారు .కే జగన్నాథం ముఖ్యఅతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు చేసి బ్రిటిష్ వారు పెట్టిన అనేక కేసులను ఎదుర్కొని కమ్యూనిస్టు పార్టీ చేస్తున్నటువంటి పోరాటాలకు ఆకర్షితులై కమ్యూనిస్టు పార్టీలో సాధారణ కార్యకర్త స్థాయి నుండి జాతీయస్థాయి ప్రధాన కార్యదర్శిగా అనేక సంవత్సరాలు ఎలాంటి స్వార్థం లేకుండా సేవలందించిన నాయకుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావుని ఆయన పోరాటాలు త్యాగాలు నేటి తరానికి ఆదర్శంగా ఉండాలని ఆయన చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ఉద్యమాలవైపు ఆకర్షితులు కావాలని చండ్ర రాజేశ్వరరావు పేరు మీద సి ఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో కర్నూల్ నగరంలో అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ఆయన వర్ధంతి సందర్భంగా బి క్యాంపు లోని వృద్ధాశ్రమంలో 30 మంది వృద్ధులకుపండ్లు బెడ్లు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సిఆర్ సేవాసమితి కమిటీ మెంబర్స్ శివప్రసాద్ సురేంద్ర రంగన్న కల్లూరు విజయ నాగేశ్వరమ్మ. మధు తదితరులు పాల్గొన్నారు.