PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శశికళ కృష్ణమోహన్ స్థానికులు కాదని ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య

1 min read

కర్నూలు జిల్లా కురువ సంఘం

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లి గ్రామం  శ్రీమతి శశికళ   నివాసం ,అలాగే భర్త శ్రీ  కృష్ణమోహన్ హొళగుంద మండలం మార్లమడికి గ్రామం లో టీడీపీ నాయకుడు  స్వర్గీయ కురువ  వెంకటరామప్ప  కుమారుడు.శ్రీమతి శశికళ కృష్ణమోహన్  మంచి వాక్చాతుర్యం కలవారు .ఆర్థికంగా , సామాజికంగా ఎదిగారు,సేవాతత్పరత కలవారు . రాజకీయంగా ఆమె ఎదిగితే కష్టమని కొందరు స్థానిక నాయకులు వారు స్థానికులు కాదని ప్రచారం  చేయడం దుర్మార్గమైన పని మరియు హేయమైన చర్య ,వారికీ కర్నూలు జిల్లా కురువ సంఘము నకు గత 20 ఏళ్ళ నుండి అవినాభావ సంబంధం కలదు.కురువ సంఘము చేసే ప్రతి కార్యక్రమంనకు ప్రత్యక్షంగాను ,పరోక్షంగానూ సహకరించారు .అలాంటి సేవాగుణం గల దంపతులకు  వారి రాజకీయ ఎదుగుదలకు అందరం పార్టీలకు అతీతంగా సహకరించాలి .వారితో ఆలూరు నియోజకవర్గం లో చాలామంది వారితో లబ్దిపొందారు .ఎన్నికల సమయం లో వారికీ వెన్నుపోటు పొడవడం ధర్మం కాదు .మన ఆడపడుచుకు అన్యాయం చేసినవారం అవుతాము .గత 2014 లో కర్నూలు జిల్లా కురువ సంఘం ఆద్వర్యం లో ఆలూరు లో నిర్వహించిన “కురువ గర్జన “కు 5 లక్షల రూపాయలు ఖర్చు చేసారు .ఆ కురువ గర్జన సభ విజయవంతం కావడంతో ఆ  నియోజకవర్గం లోని ఎంతోమంది కులజులకు  రాజకీయ పార్టీలు రాజకీయంగా ప్రాధాన్యత  కల్పించాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.2014 లో శ్రీమతి శశికళ కృష్ణమోహన్ కి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  మీరు జడ్పీటీసీ గ పోటీచేసి గెలుపొందితే కర్నూలు  జడ్పీ చైర్మన్ పదవి  ఇస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు .హైదరాబాద్ నుండి ఆలూరు వచ్చి జడ్పీటీసీ గా పోటీ చేద్దామని నిర్ణయించుకుంటే ,ఓటర్ జాబితాలో వారి పేరు లేకుండా స్థానిక నాయకులు తొలగించారు .ఎందుకంటె వీరు ఇక్కడ రాజకీయంగా స్థిరపడితే వీరిని ఎదుర్కోవడం కష్టమని కొందరు స్థానిక నాయకులు వీరిని రాజకీయంగా ఎదగకుండా అడ్డుకుంటున్న మాట అక్షరాల వాస్తవము .2019 సార్వత్రిక ఎన్నికల్లో శశికళ కృష్ణమోహన్ కి వైసీపీ పార్టీ కర్నూలు ఎంపీ ఇస్తామని ముందుకు వస్తే నాకు ఆలూరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేస్తాగాని ,ఎంపీ టికెట్ వద్దని సున్నితంగా తిరస్కరించారు .2019 లో వైసీపీ తరపున కర్నూలు ఎంపీ గా పోటీ చేసిఉంటే వారి రాజకీయ దశ మారిపోయేది .కానీ వారి దురదృష్టం అనుకోకతప్పదు .ఆలూరు లో తిరిగి 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆలూరు లో కురువ ,మదాసి ,మదారి కురువ గర్జన న కోసం నియోజకవర్గం లోని గ్రామాలన్నీ తిరిగి  40 వేల మంది  కులజులతో బహిరంగ సభను జయప్రదం చేసారు .వెంటనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  పిలిచి కర్నూలు ఎంపీ గా పోటీ చేయమని అనేకమంది టీడీపీ రాజకీయ ప్రముఖులు ఒత్తిడి చేసారు  ,కానీ ఆమె గతం లో లాగానే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆలూరు ప్రజలకు సేవచేయాలనే తపనతో , ఎంపీ టికెట్ వద్దని సున్నితంగా తిరస్కరించారు.ఇంతలా మన జిల్లాలో ఒక ఆడపడుచు ముందుకు వచ్చి తన స్వశక్తి తో ఎదుగుతున్న వారికీ సహకరించేది పోయి ఆమె స్థానికురాలు కాదని రాజకీయంగా ఆమెను సమాధి చేయాలనీ స్థానిక నాయకులు అనేక కుట్రలు పన్నుతున్నారు .ఆమెకు కులజులంతా మీ వెంట  మేమున్నామని సహకరిస్తే శ్రీమతి శశికళ కృష్ణమోహన్ దంపతులు ఎంతో  ఎత్తుకు ఎదుగుతారని , మన ఆడపడుచు ఆత్మగౌరవాన్ని కాపాడుకోలేకపోతే మనం ఇంత జనాభా ఉండికూడా వృదాయే అవుతుంది .టీడీపీ ,వైసీపీ రెండు పార్టీలు వారి సేవలను,రాజకీయ అనుభవం ను గుర్తించి ఆలూరు టి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం  దురదృష్టకరం . నియోజకవర్గం లో గెలుపు ఓటములను నిర్ణయించే మన సామాజికవర్గం లో సేవాగుణం కలిగి ఉండి అహర్నిశలు మనకోసం పాటుపడేందుకు ముందుకు వచ్చిన ఆ  దంపతులను కులజులందరు మనసారా ఆశీర్వదించవలెనని సవినయంగా కులజులందిరిని కోరుచున్నాము .

About Author