‘కిమ్స్’లో అత్యాధునిక శస్త్ర చికిత్స
1 min read– డాక్టర్ మనోజ్‌కుమార్ ఆధ్వర్యంలో లాప్రోస్కోపీ సర్జరీ
– మహిళకు ఉపశమనం కల్పించిన కిమ్స్ కర్నూలు డాక్టర్లు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: అరుదైన మూత్రనాళ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మహిళకు అత్యాధునిక శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తిచేసిన కిమ్స్ కర్నూలు ఆస్పత్రి యూరాలజీ విభాగ వైద్య నిపుణులు డాక్టర్ మనోజ్‌కుమార్ వేగంగా కోలుకునేలా చేసి ఉపశమనం కల్పించారు. మంగళవారం కిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ మనోజ్‌కుమార్ పేషెంట్ ఆరోగ్య పరిస్థితులు, చికిత్స అందించిన తీరును వివరించారు. ‘‘నంద్యాలకు చెందిన నాగమణి(47) నెల రోజులకు పైగా తీవ్రమైన కుడి వైపు కడుపునొప్పి సమస్యతో తనను సంప్రదించింది. మహిళకు కిడ్నీ సంబంధిత సమస్యగా భావించి అల్ట్రాసౌండ్ మరియు కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ కంప్యూటెడ్ టోమోగ్రపీ(సీఈసీటీ) వంటి ఉదర సంబంధిత పరీక్షలు నిర్వహించాం. వచ్చిన రిపోర్టుల ఆధారంగా నాగమణి కుడి కిడ్నీకి వాపు రావడంతో పాటు కిడ్నీ సంబంధిత ‘‘రెట్రోకావల్ యురేటర్’’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించాం. అధునాతన లాప్రోస్కోపిక్ సర్జరీ చేశాం. ముఖ్యంగా ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో సంబంధిత ప్రాంతంలో మూడు హోల్స్ చేశాం. అందులో ఒకటి 1 సెంటీమీటర్ పరిమాణం. దాని ద్వారా సర్జరీని విజయవంతంగా పూర్తి చేశాం. సర్జరీ తర్వాత పేషెంట్ వేగంగా కోలుకోవడంతో పాటు ఓపెన సర్జరీ కంటే ఎంతో మెరుగ్గా ఎటువంటి నొప్పి కూడా లేకపోవడంతో లాప్రోస్కోపీ చేసిన రెండవ రోజే డిశ్చార్జి చేసి ఇంటికి పంపించాం. ఇంటికి వెళ్లిన అనంతరం కూడా ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోగా ఆమె వారం రోజుల్లోనే తన రోజువారీ పనులను సైతం ప్రారంభించింది. అని పేర్కొన్నారు.