ముగిసిన మూల పెద్దమ్మ జాతర..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేములలో వెలసిన శ్రీ మూల పెద్దమ్మ జాతర ఘనంగా జరిగింది. ఉమ్మడి జిల్లాల నుంచే కాక ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. బుధవారం రాత్రి నుంచే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, పూల దండలు,నైవేద్యం, బోణాలు వెంట తీసుకుని డప్పుల వాయిద్యాలు నడుమ భక్తి శ్రద్ధలతో మూల పెద్దమ్మ ఆలయం కు చేరుకుని అమ్మవారికి వాటిని సమర్పించిమొక్కులుచెల్లించుకున్నారు.ఆలయ చైర్మన్ చిన్నన్న, ఆలయ ధర్మకర్తలు కేశవరావు, మాచర్ల, ఆలయ ఈవో మోహన్, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. జాతర నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాణ్యం సీఐ నల్లప్ప,ఎస్సై బీటీ వెంకటసుబ్బయ్య పోలీసు బందోబస్తు నిర్వహించారు.