PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అకారణంగా.. నాపై దాడి..

1 min read

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్​ ఇంటింటి పర్యటనలో ఈ ఘటన

  • వైసీపీ 51వ వార్డు ఇన్​చార్జ్​ క్రిష్ణకాంత్​ శర్మ ఆవేదన
  • బ్రాహ్మణుల‌పై దాడుల‌ను ఖండించిన బ్రాహ్మణ సంఘాల నేత‌లు
  • వెంటనే వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్​

కర్నూలు, పల్లెవెలుగు:తనపై అకారణంగా 51వ వార్డుకు చెందిన వై.ఎస్‌.ఆర్.సీ.పీ నాయ‌కుడు రాఘ‌వేంద్ర నాయుడు దాడి చేశాడని అదే వార్డు వై.ఎస్.ఆర్.సీ.పీ ఇంచార్జి క్రిష్ణకాంత్ శ‌ర్మ  ఆరోపించారు. గురువారం ఆయ‌న త‌న ఇంట్లో బ్రాహ్మణ సంఘం నేత‌ల స‌మ‌క్షంలో విలేఖ‌రుల‌తో మాట్లాడారు. బుధ‌వారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ ష‌రాఫ్ బ‌జార్‌లో ప్రచారం జ‌రుగుతుండ‌గా అందులో పాల్గొన్న త‌న‌పై అక్కడే ఉన్న రాఘ‌వేంద్ర నాయుడు చేయి చేసుకున్నార‌ని క్రిష్ణకాంత్ శ‌ర్మ తెలిపారు. ఎందుకు కొడుతున్నార‌ని అడిగినా వినిపించుకోకుండా కొట్టార‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. త‌న‌ను ఏం చేసినా బ్రాహ్మణులు ఎవ్వరూ ముందుకువ‌చ్చి అడ‌గ‌ర‌న్న ఉద్దేశంతోనే త‌న‌పై దాడిచేసిన‌ట్లు భావిస్తున్నట్లు క్రిష్ణకాంత్ శ‌ర్మ చెప్పారు. త‌న‌కు ఎవ్వరితో విభేదాలు లేవ‌ని అయిన‌ప్పటికీ త‌న‌పై దాడి చేయ‌డం ఎంతో బాద‌క‌లిగిస్తోంద‌న్నారు.

వైసీపీ నేతలు.. క్షమాపణ చెప్పాల్సిందే…

అనంత‌రం ఏపీ బ్రాహ్మణ సంక్షేమ స‌మాఖ్య అధ్యక్షుడు వెంక‌ట రామ రాజు మాట్లాడుతూ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రభుత్వంలో 200 మందికి పైగా బ్రాహ్మణుల‌పై దాడులు జ‌రిగాయ‌న్నారు. దాడిచేసిన వారు త‌క్షణ‌మే క్షమాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. త్వర‌లోనే ఏం చేయాల‌న్న దానిపై నిర్ణయం తీసుకుంటామ‌ని తెలిపారు. బ్రాహ్మణ సంఘం రాష్ట్ర మ‌హిళా అధ్యక్షురాలు మారుతీ శ‌ర్మ మాట్లాడుతూ వైసీపీ నేత‌లు క్రిష్ణకాంత్ శ‌ర్మపై దాడుల‌కు దిగ‌డం దారుణ‌మ‌న్నారు. పురోహితులు, అర్చకుల‌పై దాడులు పెరిగిపోయాయ‌ని తెలిపారు. ప్రతి ఒక్క బ్రాహ్మణుడు ఈ దాడిని ఖండించాల‌ని ఆమె కోరారు. పార్టీల‌తో సంబంధం లేకుండా ఇలాంటి దాడుల‌ను తాము అడ్డుకునేందుకు ముందుకువ‌స్తామ‌న్నారు. ఈ కార్యక్రమంలో క‌ర్నూలు బ్రాహ్మణ జేఏసీ క‌న్విన‌ర్ దేవిప్రసాద్, ఏ.పి.బి.ఎస్.ఎస్.ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజ‌శేఖ‌ర్ రావు, బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్రమండ‌లి అధ్య‌క్షడు చంద్రశేఖ‌ర్‌, ఏ.పి.బి.ఎం అధ్యక్షుడు సాయినాధ్ శ‌ర్మ, ప‌ర‌శురామ్ ప‌రివార్ అధ్యక్షుడు ఆనంద్ రావ్, సుబ్రహ్మణ్య ప్రసాద్ పాల్గొన్నారు.

About Author