మంత్రాలయం వైపు చూడని.. రాఘవేంద్రుడు..
1 min readటీడీపీ కంచుకోట మంత్రాలయంలో.. అడుగు పెట్టని టిడిపి అభ్యర్థి
జనబలం లేక? క్యాడర్ లేక?
మన్వయంతో దూసుకుపోతే… విజయావకాశాలు పుష్కకలం..
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : మంత్రాలయం మొదటి నుండి టిడిపి కి కంచుకోట. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టిడిపి అభ్యర్థి కే మెజార్టీ వస్తుంది. టిడిపి కి ఇంత ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం కు టిడిపి అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి పరిచయం చేసుకునేందుకు కాని ప్రచారానికి కూడా రాక పోవడంతో పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. టిడిపి అధిష్టానం వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన మాధవరం రాఘవేంద్ర రెడ్డి కి టిడిపి టికెట్ ఖరారు చేశారు. అప్పటి నుండి నియోజకవర్గంలో కౌతాళం, కోసిగి, పెద్దకడబూరు మండలాల్లో తిరగుతూ పరిచయాలు, తన వర్గం ను బలోపేతం చేసుకుంటూ ముందు కు పోతున్నాడు. కానీ టికెట్ ఖరారు చేసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో మాత్రం అడుగు పెట్టలేదని పలువురు చర్చించుకుంటున్నారు.
క్యాడర్ లేక పోవడమే… కారణమా…!
నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయంలో అభ్యర్థి కి జన బలం కాని క్యాడర్ కాని లేక రాలేక పోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల పింఛన్లను సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి ఇవ్వాలని స్థానిక ఎంపిడిఓ కార్యాలయానికి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన రాఘవేంద్ర రెడ్డి వెంట స్థానికులు ఒకరిద్దరు తప్ప ఎవరు కూడా లేకపోవడంతో ఆయన ఒకరే ఇచ్చి వెళ్లారని, టిడిపి అభ్యర్థి వెంట జనం లేకపోవడంతో ఏమిటని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాగే ఉంటే జరగబోవు సార్వత్రిక ఎన్నికలలో టీడీపి కు ఇక్కడ ఏజెంట్లైన ఉంటారా అనే ప్రశ్న తలెత్తుత్తుంది. ఎప్పడూ టీడీపి కు మెజారిటీ ఇస్తున్న మంత్రాలయంలో ఈ సారి మెజారిటీ ఇస్తారా లేదా ఇంకా సమయం ఉందని అంత లోపు ఇక్కడ క్యాడర్ ను బలోపేతం చేసుకుని అడుగు పెడతాడ లేక ముందుగానే అడుగు పెడతాడో లేదో కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.