అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తా: టీజీ భరత్
1 min read– బుధవారపేటలో టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం
కర్నూలు, పల్లెవెలుగు:ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజలందరూ తన పనితీరు చూస్తారని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. నగరంలో 15వ వార్డు బుధవారపేటలో ఆయన టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. తనను గెలిపిస్తే కర్నూలును ఎంతో అభివృద్ధి చేస్తానని ప్రజలతో చెప్పారు. మహిళల సంక్షేమం, అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక పెన్షన్ రూ.4 వేలు అందజేస్తామన్నారు. పేద ప్రజల కష్టాలు తీరాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పారు. ఐదేళ్లలో ప్రజలకు తాగునీటి సమస్యలేకుండా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని మాటిచ్చారు. కర్నూలులోని వీధివీధిలో ఎన్నో సమస్యలు ఉన్నాయని వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఆరు గ్యారెంటీలు రూపొందించినట్లు వివరించారు. తాను గెలిచి తమ ప్రభత్వం వచ్చాక టీడీపీ సూపర్ సిక్స్ పథకాలతోపాటు ఆరు గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తానన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక విధానం అమలుచేసి భవన నిర్మాణ రంగాన్ని ఆదుకుంటామన్నారు.
సమస్యలు మొరపెట్టుకున్న ప్రజలు:
టీజీ భరత్ భరోసా యాత్రలో భాగంగా బుధవారపేటలో పర్యటించిన టీజీ భరత్‌కు ప్రజలు సమస్యలు మొరపెట్టుకున్నారు. కాలువలు, రోడ్లు, వీధి లైట్లు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, తాగునీరు సమస్యలు అన్ని పరిష్కరించాలని వేడుకున్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని పలువురు వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైనప్పటికీ పెన్షన్లు అందడం లేదని తమ బాధను చెప్పుకున్నారు. ప్రజల సమస్యలు విన్న టీజీ భరత్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వంలో అర్హులకు న్యాయం జరగలేదన్నారు. అందుకే ఓటు వేసేటప్పుడు ఎలాంటి వ్యక్తికి ఓటు వేస్తే మంచి జరుగుతుందో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. తన ఆరు గ్యారెంటీల్లో ఈ సమస్యలు అన్ని పొందుపరిచానని.. తనను గెలిపిస్తే వీటన్నింటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పామన్న, అబ్బాస్, రామాంజనేయులు, కార్పొరేటర్ పరమేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోతురాజు రవి, జేమ్స్, లవ కుమార్, నారాయణ, రామకృష్ణ బాబు, తిక్కన్న, సూర్య కాంతమ్మ,, మహిళ నాయకురాళ్లు ముంతాజ్, రాజ్యలక్ష్మి, బూత్ ఇన్చార్జీలు ధ్రువ, చంద్రశేఖర్, వెంకటేష్, సాగర్, వినయ్, విల్సన్, యశ్వంత్, భార్గవ్, రంజిత్, నాగేంద్ర, రఘు, విక్రమ్, అజయ్, సతీష్, వంశీ, హరి, గిరి, చిన్ని, శివ, వినయ్, తదితర జనసేన నాయకులు పవన్, రామ్ ప్రకాష్, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.