ఓ తరం యువత నష్టపోయింది
1 min readపల్లెవెలుగు వెబ్: ఉద్యోగాలు లేక తెలంగాణలోని ఓ తరం యువత నష్టపోయిందని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వం ఏడేళ్లుగా ఉద్యోగాల భర్తీ చేయడంలేదని ఆరోపించారు. రాష్ట్రంలో లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. కరోనతో పేద ప్రజల జీవితాలు చితికిపోయాయని అన్నారు. కేసీఆర్ ఒకవైపు, కరోన ఇంకోవైపు ప్రజలన్ని వేధిస్తున్నాయని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం పోతేనే ప్రజలు బాగుపడతారని అన్నారు. తెలంగాణలో ఏ ఉపఎన్నిక జరిగినా.. కాంగ్రెస్ కార్యకర్తలు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.