చంద్రబాబు అబద్ధపు హామీలు నమ్మి మోసపోవద్దు
1 min readబుట్టా రేణుక అమ్మని గెలిపించండి అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాము
ఎన్నికల ప్రచారంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక తనయుడు బుట్టా ప్రతుల్
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: నందవరం మండలంలోని జోహారాపురం గ్రామం నందు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా బుట్టా ప్రతుల్కి గ్రామ వాసులు ఘనంగా స్వాగతం పలికారు. ఎన్నికలు దగ్గర పడటంతో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆపార్టీ నేతలు ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తారని, వాటిని నమ్మి మోసపోవద్దని వైఎస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక తనయుడు బుట్టా ప్రతుల్ అన్నారు.జోహారాపురం గ్రామం నందు వృద్ధులు, మహిళలను ఆప్యాయంగా పలకరించారు. ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం బుట్టా ప్రతుల్ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టాక నెరవేర్చకుండా ప్రజలను నిండా ముంచారని గుర్తు చేశారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో అవినీతికి తావులేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల వద్దే సంక్షేమ పథకాలుఅందించామన్నారు.ఫ్యాన్ ప్రభంజనం ఖాయం మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఫ్యాన్ ప్రభంజనం ఖాయమని బుట్టా ప్రతుల్ అన్నారు. ప్రజా సం కల్ప పాదయాత్రలో ప్రజల ఇబ్బందులను చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల అభ్యున్నతి కోసం నవరత్నాలు తీసుకువచ్చారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయ న్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అందిస్తున్న పథకాలు కొనసాగలంటే మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలన్నారు.రెండు ఓట్లు ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక కి,రెండు ఎంపీ అభ్యర్థి బి వై రామయ్య కి వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు శివారెడ్డి గౌడ్ ,నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు విరుపాక్షి రెడ్డి , జడ్పిటిసి నిఖిల్ చక్రవర్తి . మండల జేసియస్ కన్వీనర్ చాంద్ బాషా గారు,బలరాం ,సోమలగూడూరు వెంకటేశ్వర్ రెడ్డి ,పోనకలదీన్నే సర్పంచ్ నాగరాజు ,రమేషప్ప గౌడ్ ,ఎల్లగౌడ్ , పెద్దకొత్తిలి సర్పంచ్ శివన్న ,ఎంపీటీసీ మోహన్ రెడ్డి ,మాజి సర్పంచ్ విరూపాక్షి రెడ్డి ,రామచంద్రప్ప ,రాముడు ,నరసింహులు ,సోట్టరంగన్న ,రంగారెడ్డి ,సూర్యప్రకాష్ రెడ్డి ,శంకర్ రెడ్డి ,రాఘవరెడ్డి , రంగా రెడ్డి ,సోమన్న ,హనుమంతు , మల్లయ్య ,వెంకటేష్ ,జయరామి రెడ్డి ,రాజారెడ్డి ,రఘు ,నరసప్ప ,ఎర్ర నరసింహులు ,నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.