40వ శ్రీరామనవమి వార్షిక ఉత్సవాలు
1 min readఉత్సవాల ఏర్పాట్లు నిర్వహిస్తున్న శ్రీ సీతారామ నామ సంకీర్తన క్షేత్రం కమిటీ నిర్వాహకులు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండల కేంద్రమైన చెన్నూరు శ్రీ సీతారామ నామ సంకీర్తన క్షేత్రంలో ఈనెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 40వ శ్రీరామనవమి వార్షిక ఉత్సవాలు నిర్వహించేందుకు కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.14వ తేదీన ఆదివారం వార్షిక కళ్యాణోత్సవ పూజ కార్యక్రమాలు వేద పండితుల చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుండి గణపతి పూజ. పుణ్య వాచనం. అఖండ దీప స్థాపనం. అంకురారోహణం. మంగళ హారతి. తదుపరి తీర్థ ప్రసాదాలు వినియోగం వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.15వ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు సర్వత్ భద్ర మండల పూజా. కలశపూజ. రుద్రాభిషేకం. అగ్ని ప్రతిష్ట. శ్రీరామ హోమం. మంగళ హారతి వేద పండితుల చేతులమీదుగా నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు విష్ణు సహస్రనామ సామూహిక పారాయణం మరియు సంకీర్తన గోపూజ నిర్వహించనున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రదోషకాల పూజ. అష్టోత్తర అర్చన. హారతి తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం ఐదున్నర గంటల నుండి రాత్రి ఏడున్నర గంటల వరకు,, శ్రీ రామ యణకఆవ్యం . ఆధునిక ప్రపంచానికి ఆవశ్యకత,,ను విశ్వహిందూ పరిషత్ ఆంధ్ర దక్షిణ విభాగం కార్యదర్శి. ఉపన్యాసకులు. శ్రీమాన్ కాకర్ల రాముడు వివరించనన్నారు. రాత్రి ఏడున్నర గంటల నుంచి కమిటీ నిర్వాహకులచే భోజన ప్రసాద వితరణ భక్తులకు అందించనున్నారు. రాత్రి 8 గంటలకు .సాంప్రదాయ నృత్య ప్రదర్శన. చెన్నూరు కు చెందిన నట మయూరి అవార్డు గ్రహీత. శ్రీమతి నున్న వీరలక్ష్మి గారి బృందం చే నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.16వ తేదీన మంగళవారం ఉదయం 6 గంటలకు శ్రీ ఆంజనేయ స్వామి వారికి పంచామృతాభిషేకం ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజ నవగ్రహ పూజ శ్రీ రామ రోమములు ఏర్పాటు చేశారు. ఉదయం ఏడు గంటల నుంచి 12:30 గంటల వరకు హనుమాన్ చాలీసా పారాయణం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం భక్తులకు భోజన ప్రసాద వితరణ . సాయంత్రం పూజ శ్రీ వీర జానంద స్వామి చే హనుమంతు వైభవం ఆధ్యాత్మిక ఉపన్యాసం నిర్వహించనున్నారు. 17వ తేదీ బుధవారం శ్రీరామనవమి పర్వదినాన ఉదయం 5 గంటల నుండి 8 గంటల వరకు శ్రీరాములవారిచే పంచామృత అభిషేకం. ఉదయం 9:30 గంటల నుంచి శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వివిధ కార్యక్రమాలను శ్రీ కోడూరు రాజస్వామి మరియు వారి శిష్య బృందం చే నిర్వహించనున్నారు. కళ్యాణోత్సవం సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి చెన్నూరు పురవీధుల గుండా శ్రీ సీతారాముల గ్రామోత్సవం ఏర్పాటు చేశారు.