ప్రతిపక్షాలు ఏకమైన వైసీపీదే గెలుపు : బుట్టా ప్రతుల్
1 min readచంద్రబాబుకు మరోసారి బుద్ధి చెప్పండి
నందవరం మండలంలోని గంగవరం గ్రామంలో ఎన్నికల ప్రచారం
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: నందవరం మండలంలోని గంగవరం గ్రామంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక తనయుడు బుట్టా ప్రతుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుట్టా ప్రతుల్ మాట్లాడుతూ జగన్ సర్కార్ చేపట్టి 4 యేళ్ల 9నెలలు వ్యవదిలో అనేక సంక్షేమం అభివృద్ధి అవినీతికి ఆస్కారం లేకుండా జరిగిందన్నారు.ఓట్లు అడిగే ధైర్యం వైసిపి నాయకులకు ఉందన్నారు. కనీవిని ఎరుగని రీతిలో ఎనలేని సంక్షేమ ఫలాలు నేరుగా వారి వారు ఖాతాలోనే జమ చెయ్యడంపై ప్రజలు ఆకర్షితులు అయ్యారన్నారు.టిడిపికి రాష్ట్ర స్థాయిలో క్షేత్ర స్థాయి నుండి బలమైన కేడర్ లేదన్నారు.జగన్మోహన్ రెడ్డి కరోనా సమయంలో కూడా ఏ పథకాన్ని అపకుండానే మరోవైపు ఆర్థిక మాంథ్యం తట్టుకొని ప్రజలకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం అని అన్నారు. ఒక కుటుంబ సభ్యులుగానే ఉండి తనను ఎంపిని అత్యతిక మెజారిటీని ఎన్నికల్లో ఇస్తారని తనకు నాయకులపై నమ్మకం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంక్షేమం,అభివృద్ధి కోసం నిత్యం శ్రమిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలు జగనన్న మీద యుద్ధం చేస్తుంటే, జగనన్న పేదరికంపై యుద్ధం చేస్తూ ప్రతి ఇంటికి ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నారని, అలాంటి ముఖ్యమంత్రి వెంట ప్రజలందరూ నడవాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేసిన సంక్షేమంలో పాలు పంచు కోవడం ఎంతో ఆనందంగా ఉందని,జగనన్న అందచే స్తున్న సంక్షేమాన్ని చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు ఎన్నో ఆరోపణలు చేశారని. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు శివారెడ్డి గౌడ్ ,నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు విరుపాక్షి రెడ్డి ,జడ్పిటిసి నిఖిల్ చక్రవర్తి ,మండల జేసియస్ కన్వీనర్ చాంద్ బాషా ,బలరాం ,సోమలగూడూరు వెంకటేశ్వర్ రెడ్డి ,పెద్దకొత్తిలి సర్పంచ్ శివన్న ,ఎంపీటీసీ మోహన్ రెడ్డి మాజి సర్పంచ్ విరూపాక్షి రెడ్డి,జైరామిరెడ్డి , వెంకట్రామిరెడ్డి ,రాజారెడ్డి,రామచంద్రప్ప , రాముడు , నరసింహులు , సోట్టరంగన్న,రంగారెడ్డి ,సూర్యప్రకాష్ రెడ్డి ,రంగా రెడ్డి ,సోమన్న ,హనుమంతు ,మల్లయ్య ,వెంకటేష్ ,రఘు ,నరసప్ప ,మాచపురం కోటేశ్వరరావు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.