ఇంటింటికీ ఇంతియాజ్ కార్యక్రమం
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఇంటి ఇంటికీ ఇంతియాజ్ కార్యక్రమంలో భాగంగా నేడు నగరంలోని 48 వ వార్డు రోజా వీధి నందు వైసీపీ MLA ఇంతియాజ్ ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ప్రజలు తమ సమస్యలను ఇంతియాజ్ దృష్టికి తీసుకు వచ్చారు. గెలిచిన వెంటనే సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తానని ప్రజలకు హామీ నిచ్చారు.కర్నూలు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ A.Md. ఇంతియాస్, తోపాటు కర్నూలు మాజీ ఎమ్మెల్యే శ్రీ SV మోహన్ రెడ్డి , కార్పొరేటర్లు వైసిపి నాయకులు మరియు కార్యకర్తలు.పాల్గొన్నారు.