PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అవయవదానం – కర్నూలు ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో కృష్ణవేణి అనే 38 ఏళ్ల O+ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ మహిళ  బ్రెయిన్ డెత్ జరిగింది.. ఆ మహిళ నుంచి అవయవాలను సేకరించడం జరిగింది.. ఈ మహిళ బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యి బ్రెయిన్ డెత్ అయింది.. వాళ్ళ కుటుంబ సభ్యులు అవయవాలు దానం చేసేకి ఒప్పుకున్నారు.జీవన్దాన్ సభ్యులు ఆమె యొక్క  గుండెను తిరుపతి పద్మావతి ఆసుపత్రికి, కాలేయాన్ని స్విమ్స్ తిరుపతి ఆసుపత్రికి కేటాయించారు.. అదేవిధంగా ఒక కిడ్నీని కిమ్స్ కర్నూలు ఆసుపత్రికి, ఒక కిడ్నీని ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు అలాట్ చేశారు.మేము ప్రభుత్వ సర్వజన వైద్యశాల నుంచి నెఫ్రాలజీ మరియు యురాలజీ వైద్య బృందంతో పాటు మేము కూడా గుండె ను తొలగించే  సభ్యులు తో పాల్గొన్నాము.. స్విమ్స్ మరియు పద్మావతి ఆసుపత్రి నుంచి ఇందుకోసం సపరేట్గా వైద్య బృందాలు వచ్చాయి.. కాలేయము మరియు గుండెను స్పెషల్ గా హెలికాప్టర్ ద్వారా కర్నూలు నుంచి తిరుపతికి తీసుకెళ్లారు.. దీనికి పోలీసు వారి సహకారంతో  గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది..తరువాత కర్నూలు ఆసుపత్రిలో ఒక కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ కు మా బృందం యూరాలజీ నిపుణులు డాక్టర్ సీతారామయ్య మరియు నెఫ్రాలజీని నిపణులు, మత్తుమందు నిపణులు మరియు నేను కలిసి కిడ్నీ మార్పిడి చేయడం జరిగింది..ఈ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది.ఈ విధంగా కర్నూల్ లో ఆసుపత్రిలో రెండవ కడావరిక్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది.. ఇంకా మన దగ్గర కాలేయము, ఊపిరితిత్తులు, గుండె మార్పిడి కూడా జరగాల్సి ఉంది.. అది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అయినా కొన్నాళ్లలో అది కూడా పూర్తి అవుతుందని ఆశాభావంతో ఉన్నాం..డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MChగుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులుప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలుఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పబ్లిక్ రిలేషన్స్ కమిటీ మెంబర్.

About Author