NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘బైపాస్​ రోడ్డు’బాధితులకు అండగా.. ఉంటా..

1 min read

బైపాస్​ రోడ్డుకు కేటాయించిన 260 ఎకరాలు ఎక్కడా..?

  • జాతీయ రోడ్డు రూట్​ మ్యాప్​ను ఎందుకు చేంజ్​ చేశారు…?
  • ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకున్నారా… లేదా సభ ఎక్కడైనా పెట్టారా…?
  • ఎమ్మెల్యే సాయిప్రసాద్​ రెడ్డిని ప్రశ్నించిన కూటమి అభ్యర్థి డా. పార్థసారధి

ఆదోని, పల్లెవెలుగు:ఆదోని పట్టణం మీదుగా బైపాస్​ రోడ్డు ( జాతీయ రహదారి) నిర్మించేందుకు… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 260 ఎకరాల భూమి ఎక్కడికి పోయింది…. జాతీయ రహదారి రూట్​ మ్యాప్​ను ఎందుకు చేంజ్​ చేశారంటూ ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి  ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డిని ఘాటు ప్రశ్నించారు. శనివారం బైపాస్​ రోడ్డు బాధితులు 90 మంది కూటమి అభ్యర్థి డా. పార్థసారధిని కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఆదోని బైపాస్​ రోడ్డుకు కేటాయించిన 260 ఎకరాల భూమి ఏమైందని…. బైపాస్​ రోడ్డు రూట్​ మ్యాప్​ చేంజ్​ చేసేందుకు మీరెవరని ప్రశ్నించారు. బైపాస్​ రోడ్డు ఏర్పాటు చేసే సమయంలో ప్రజా అభిప్రాయసేకరణ ఏమైనా తీసుకున్నారా… సభ.. ఎక్కడైనా పెట్టారా అని ధ్వజమెత్తారు.  జాతీయ రహదారికి సంబంధించిన బైపాస్​ రోడ్డు రూట్​ మ్యాప్​ చేంజ్​ చేసేందుకు మీరెవరని ఆగ్రహం వ్యక్తం చేసిన డా. పార్థసారధి…. బైపాస్​ రోడ్డు బాధితులకు అండగా ఉంటానని, అధైర్యపడవద్దన్నారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి, తన అనుచరులు కలిసి బైపాస్​ రోడ్డుకు కేటాయించిన భూమిని కబ్జా చేసినట్లు తెలుస్తోందని, దీనిపై ఊరికే వదిలే ప్రసక్తే లేదన్నారు.  ఆదోనిలో రౌడీరాజ్యం నడుస్తోందని, అందుకే బాధితులు ఎవరికి చెప్పుకోలేక…మానసికంగా ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.కేంద్రంలో వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమని, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వమే వస్తుందని, ఆదోనిలో తాను ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని ఈ సందర్భంగా డా. పార్థసారధి ధీమా వ్యక్తం చేశారు.  

About Author