సీఎం జగన్పై దాడి..హేయమైన చర్య..
1 min readకర్నూలు, పల్లెవెలుగు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై విజయవాడలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వైసీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఇంతియాజ్. సీఎం జగన్ చేస్తున్న బస్సు యాత్ర, సిద్ధం సభకు ప్రజల నుంచి విశేష ఆదరణ చూసి ఓర్వలేకనే… ప్రతిపక్షాలు ఇలా రాళ్లతో దాడికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులు తక్షణమే విచారణ వేగవంతం చేసి దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని శనివారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో వైసీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఇంతియాజ్ కోరారు.