పుట్టుకే కానీ చావులేని మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : పుట్టుకే కానీ చావులేని మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు స్థానిక గడివేముల వైయస్సార్సీపీ కార్యాలయం ఆవరణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నరసింహారెడ్డి యూత్ ప్రెసిడెంట్ వంగాల ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ అనగారిన కులాల బానిస సంకెళ్లు విడిపించిన ముక్తి ప్రదాత ఈ దేశానికి రాజ్యాంగం రాసి దిశ దశ నిర్దేశించిన దీర్ఘదర్శి సామాజిక విప్లవకారునీ గతి తప్పిన భారతీయ సమాజానికి సరైన దారిలో నడవడం తప్పనిసరి అయ్యేలా చేసిన ఆదర్శనీయుడు మనిషిని మనిషిగా చూడాలని స్వేచ్ఛ సమానత్వం తో ప్రతి ఒక్కరు జీవించాలని వాటి కోసం తన జీవితాన్ని ధారపోసిన మహోన్నత వ్యక్తి బోధించు సమీకరించు పోరాడు అనే ఆలోచనలను గడపగడపకు తీసుకుని వెళ్లిన మేధావి ఒక ఆర్థికవేత్తగా రాజకీయవేత్తగా సమ సమాజానికి సంఘసంస్కర్త గా చేసిన సేవలు ఎనలేనివి అని ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి మహనీయుడు భారతదేశంలో పుట్టడం మన దేశానికి ఎంతో గర్వకారణమని భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో సాయి బుజ్జి రాకేష్ రాము సుధాకర్ హనోకు సుధీర్ రాకేష్ ప్రేమ్ వినయ్ నాని వంశీ వినీత్ తదితరులు పాల్గొన్నారు.