ఆర్థిక సాంఘిక వ్యవస్థలను రూపుమాపిన మహానుభావుడు.. గౌరు చరిత రెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్ పాణ్యం: భారత రాజకీయ, ఆర్థిక, సాంఘిక వ్యవస్థలలోని అసమానతలను రూపుమాపి, భారతీయ సమాజాన్ని తీర్చిదిద్దిన ఆధునిక సమాజ నిర్మాతల్లో అంబేద్కర్ అగ్రగణ్యులు. బలహీన వర్గాల్లో చైతన్యాన్ని రగిలించి, వారికి నాయకత్వం వహించి అభ్యుదయ శక నిర్మాణానికి అంబేద్కర్ రాజీలేని పోరాటం చేశారు. భారత రాజ్యాంగం ద్వారా దళితులకు ఆర్థిక, రాజకీయపరమైన హక్కులను సంక్రమింపజేయడంలో అంబేద్కర్ చేసిన కృషి మూలంగానే నేడు దళితులు అన్ని రంగాలలో సముచిత స్థానాన్ని అందుకోగలుగుతున్నారు. ఈరోజు డా అంబేద్కర్ జయంతి సందర్భంగా పాణ్యం మండల కేంద్రంలో ఆ మహాశయుని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి ఈ సందర్భంగా సమాజానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి లాయర్ బాబు మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు.