భారతరత్న డా .. బి .ఆర్ .అంబేద్కర్ అణగారిన వర్గాల ఆశాజ్యోతి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కురువ సంఘము మరియు బి .సి . ఎస్ .సి .ఎస్ .టి .వర్గాల ఆధ్వర్యంలో భారతరత్న డా .బి .ఆర్ .అంబెడ్కర్ 133 వ జయంతి సందర్బంగా ఆదివారం ఆత్మకూరు లోని సర్కిల్ నందు కర్నూలు జిల్లా కురువ సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి ,నందికొట్కూరు మండలం కురువ సంఘం అధ్యక్షులు కే .వెంకటేశ్వర్లు ,వీపనగండ్ల మహేష్ , విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది .ఈ సందర్బంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డా .బి.ఆర్ .అంబెడ్కర్ అణగారిన వర్గాల వారి హక్కులను కాపాడేందుకు ఆయన నిరంతరాయంగా చేసిన కృషి మన సామాజిక వ్యవస్థలో మౌలిక సంస్కరణలకు దారితీసిందని పేర్కొన్నారు .ఈ కార్యక్రమం లో బి .సి ..ఎస్ .సి .,ఎస్ .టి సంఘాల నాయకులు పాల్గొన్నారు .