మూడు రోజులుగా నష్టాల్లో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. వరుసగా మూడో రోజు కూడ నష్టాలను చవిచూశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్ .. తర్వాత నష్టాల వైపుగా సాగింది. నిఫ్టీ 50 – 26 పాయింట్లు నష్టపోయి 15,721 వద్ద ట్రేడింగ్ ముగించింది. సెన్సెక్స్ 66 పాయింట్ల నష్టంతో 52,482 వద్ద ట్రేడింగ్ ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 238 పాయింట్లు నష్టపోయి 34,772 వద్ద ట్రేడింగ్ ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 74.32 వద్ద నిలిచింది. పవర్, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది.