కర్నూలు నియోజకవర్గం కురువల ఆత్మీయ సమావేశం
1 min readపాల్గొన్న కర్నూలు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి బస్తిపాటి నాగరాజు
రాజకీయంగా కురువల కు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీనే
కురువల పోరాట ఫలితంగానే కురువ కులానికి చెందిన తనకు ఎం.పి టిక్కెట్ వచ్చింది
కురువలందరూ ఏకతాటి పైకి వచ్చి తనను గెలిపించాలి
తాను ఓడిపోతే కురువలు రాజకీయంగా సమాధి అవుతారు.. బస్తిపాటి నాగరాజు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాజకీయంగా కురువలకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీనేనని కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు.. కర్నూలులోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కర్నూలు నియోజకవర్గ కురువల ఆత్మీయ సమావేశంలో నాగరాజు పాల్గొన్నారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కురువల పోరాట ఫలితంగానే తనకు ఎం.పి టిక్కెట్ వచ్చిందన్నారు.. జిల్లాలో 40 ఏళ్లుగా కురువలకు ఎప్పుడూ ఏ పార్టీ ఎం.పి, ఎం.ఎల్ ఏ గా టిక్కెట్ ఇవ్వలేదు..మొదటి సరిగా టిడిపి కురువలకు టిక్కెట్ కేటాయించిందని పేర్కొన్నారు.. చంద్రబాబు కి లక్ష మెజార్టీతో గెలుస్తానని మాటిచ్చి వచ్చానని..కురువలందరూ ఏకతాటి పైకి వచ్చి తనను గెలిపించాలన్నారు…ఎం.పి గా గెలిస్తే కురువలను చైతన్య పరిచి దశ దిశ మారుస్తానన్న నాగరాజు..ఇది రాకరాక వచ్చిన అవకాశమని ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతే కురువలు రాజకీయంగా సమాధి అవుతారని హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆర్షద్, పవన్ కుమార్, 8వ వార్డు కార్పొరేటర్ కురువ పరమేష్, కురువ సంఘం నాయకులు, నగరంలోని 33 వార్డులకు చెందిన కురువలు పాల్గొన్నారు.