PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజాసేవకే…వచ్చా..

1 min read

ఆదోనిని అభివృద్ధి చేస్తా…

  • కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెప్పిస్తా…
  • ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి
  • బీసీ వర్గానికి చెందిన పార్థసారధి..
  • కేంద్రంలో మంచి పేరున్న వ్యక్తిని… ఆదరించండి..
  • టీడీపీ ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు
  • అలసందగుత్తి, బసరకోడులో కూటమి ప్రచారానికి విశేష స్పందన

 ఆదోని, పల్లెవెలుగు: ప్రజా సేవ చేసేందుకే… రాజకీయాల్లోకి వచ్చానని, తనను గెలిపిస్తే వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన ఆదోనిని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానన్నారు ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న సాయి ప్రసాద్​ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని మరిచి…స్వలాభార్జన పై దృష్టి పెట్టాడని ఆరోపించారు. సోమవారం ఆదోని మండలంలోని అలసంద గుత్తి, బసరకోడు గ్రామంలో కూటమి అభ్యర్థి డా. పార్థసారధితోపాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, జనసేన నియోజకవర్గ ఇన్​చార్జ్​ మల్లప్ప, గుడిసె కృష్ణమ్మ తదితరులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో కూటమి ప్రచారానికి విశేష స్పందన లభించింది. గ్రామాల్లో గజమాలతో స్వాగతం పలికారు. బసరకోడు గ్రామంలో  పీఎం అవాజ్​ యోజన పథకం కింద  కట్టుకున్న ఇంటిపై ప్రధాని నరేంద్రమోదీ పోటో లేకుండా… అది కూడా గ్రామీణ ప్రజలకు అర్థం కాకుండా ఇంగ్లీష్​లో రాశారని,  ఇది ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి, సీఎం జగన్​మోహన్​ రెడ్డి పేదలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. కేంద్ర నిధులతో ఇల్లు కట్టుకున్న వారికి…. వైసీపీ ప్రభుత్వం కట్టించిందని చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు. అదేవిధంగా కేంద్రం రేషన్​ ఇస్తుంటే…తామే ఇస్తున్నట్లు పోటోలు పెట్టుకోవడం..  ఏమిటని ఘాటుగా ప్రశ్నించారు. గ్రామాల్లో రోడ్లు, కాల్వలు, వీధిలైట్లు ,తాగునీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నా… ఎమ్మెల్యే సాయిప్రసాద్​ రెడ్డి పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

పార్థసారధిని.. ఆశీర్వదించండి…: మీనాక్షినాయుడు

 ఆదోని మండలంలోని అలసందగుత్తి, బసర కోడు గ్రామాల్లో పర్యటించిన అనంతరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు మాట్లాడుతూ డా. పార్థసారధి బీసీ వర్గానికి చెందిన వ్యక్తి అని…. ఆశీర్వదించి… గెలిపించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి పార్థసారధి అని… కర్నూలు జిల్లాలోనే ఆదోనిని ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తాడని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి…. కూటమి అభ్యర్థి డా.పార్థసారధి గుర్తు కమలం (పువ్వు) గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు.

About Author