ఏలూరు పార్లమెంట్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి
1 min readవిద్యార్థి నాయకుడు కొండపల్లి శ్రీనివాస్
కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఆశించి భంగపడ్డ..
విద్యార్థి దశ నుండే సంఘ సేవకుడిగా సామాజిక ఉద్యమం
మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, సన్నిహితుల కోరిక మేరకే ఈ నిర్ణయం
ప్రజాసేవ కోసం తాను నేటికీ అవివాహాతుడిగానే ఉన్నా..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు పార్లమెంటు నుండి ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఆశించి భంగపడ్డనని దళిత విద్యార్థి నాయకుడిగా తన ఆవేదనను ఏలూరు జిల్లాలో ఉన్న తన అత్యంత సన్నిహితులతో బాధను పంచుకునే ఉద్దేశ్యంతో ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ బి.ఎస్.ఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ టికెట్ను చివరి నిమిషం వరకు ఆశించి రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వై.యస్. షర్మిల రెడ్డి దగ్గర ఘోరమైన రాజకీయ మోసానికి గురైన ఒక దళితుడిగా విద్యార్థి నాయకుడిగా ఏలూరు జిల్లాలో ఉన్న మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు సన్నిహితుల కోరిక మేరకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. విద్యార్థి దశ నుండే సంఘ సేవకుడిగా సామాజిక ఉద్యమ నాయకుడిగా సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలతో మమేకమైన అనుభవం తనకు ఉందన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో పిజి.పి.హెచ్.డి కోర్సులు అభ్యసిస్తున్న రోజుల్లోనే విద్యార్థి నాయకుడిగా అనేక విద్యార్థి ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు, సంఘసేవ కార్యక్రమాలు చేపట్టిన ఘన చరిత్ర. అనుభవం తనకి ఉందన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో పి.హెచ్.డి. కోర్సు అభ్యసిస్తున్న కాలంలో నెలలో 20 రోజులు కాలేజికి వెళ్లి మిగిలిన 10 రోజులు విశాఖపట్టణం ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఏలూరు జిల్లాకి వచ్చి అనేక సంఘసేవా కార్యక్రమాలు నిర్వహించిన నాయకత్వ అనుభవం తనకు ఉందన్నారు. తాను ఎంపీ అవ్వాలనే ఆకాంక్ష తన కోసం, తన వారి స్వార్ధం కోసం కాదని అన్నారు. ప్రజా సేవ కోసం తాను నేటికీ అవివాహతుడిగానే ఉన్నానన్నారు. మెట్ట ప్రాంతమైన ఏలూరు జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నందున అభివృద్ధి చేసే ఉద్దేశంతోనే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నదాతగా పిలువబడుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సాధించడానికి. పార్లమెంట్ మెంబర్ గా ఎన్నికై చట్టసభలో తన గొంతును వినిపించే ఉద్దేశంతోనే తను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏలూరు పార్లమెంటు జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుండి మద్దతుదారులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా దళిత ప్రజాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కాపుదాసి రవికుమార్, బహుజనసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మత్తే గౌతమ్ సిద్ధార్థ్ (బాబి), బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజ్జం చిరంజీవి, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రచార కార్యదర్శి పల్లిపాము జోసఫ్ తంబి, బహుజనసేన జిల్లా అధ్యక్షులు పిట్టా రాహుల్, దళిత ప్రజాసమితి నాయకులు కాగిత డేవిడ్ రత్నం, బత్తుల అశోక్, తదితరులు పాల్గొన్నారు.