హోళగుంద మండలం అభివృద్ధి ఎక్కడ..
1 min readహోళగుంద మండల ప్రజలు సమస్యలు పరిష్కారం అయ్యేది ఏనాడో…
AISF కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ
పల్లెవెలుగు వెబ్ హోళగుంద : ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గం ప్రజల సమస్యలపై పరిష్కారం అయ్యేనా.సంవత్సరాలు తరబడి పెత్తందారుల_ వ్యవహరించి ఇప్పుడు వచ్చి ప్రజల సేవ అంటున్నారా.మా హోళగుంద మండలానికి బస్సులు రద్దు అయినప్పుడు ఎక్కడికి వెళ్లారు మీరంతా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నాయి అప్పుడు మీరంతా ఎక్కడున్నారు.మన ఆలూరు నియోజకవర్గం లో త్రాగునీరు సాగునీరుకు కావాల్సిన నగరడోని రిజర్వాయర్ వేదవతి ప్రాజెక్ట్ హంద్రీనీవా ప్రాజెక్టుల.పరిష్కారం అయ్యేనా.. ఇన్ని సంవత్సరాలు లేని సేవ ఇప్పుడు వచ్చి ప్రజలసేవ అంటూ ఓటర్ల మహాశయులను మభ్యపెట్టడానికి ఇప్పుడు మీరు వస్తున్నారా.ప్రజల సేవ పేరుతో ప్రజల సొమ్మును దోచుకుని పెత్తందారుల అవ్వడానికా కులం మతం పేరుతో రాజకీయాలు చేయడమా మా కులం ఓట్లు ఇన్ని ఉన్నాయి మా కులం ఓట్లు అన్ని ఉన్నాయి అని అడిగే నాయకులు అభివృద్ధి గురించి అడిగారా.ఇప్పటికీ కొన్ని గ్రామాలకి సరైన సౌకర్యానికి బస్సులు త్రాగడానికి మంచినీళ్లు రహదారులు గురించి ఏనాడైనా ఉద్యమాలు చేశారా మీరు మీ స్వార్థం కోసం మీరు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు.కదా ఏ రోజైనా ప్రధాన పార్టీల అధిష్టానాన్ని దగ్గరికి ఆలూరు సమస్యలు తీసుకెళ్లి ప్రశ్నించారా. మా ఆలూరు నియోజకవర్గం వెనుకబడి ఉంది అభివృద్ధి చేయండి అని ప్రశ్నించారా మన హోళగుంద మండలంలో మూతబడిన Sc హాస్టల్ గురించి ఏనాడైనా పోరాడైన వ్యక్తి మీలో ఉన్నారా మన హోళగుంద జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఎంత అవస్థలు పడ్డారో మీకు తెలుసా? ఏరోజైనా ఆ సమస్య కోసం మీరు పోరాడారా. అదేవిధంగా మన మండలానికి ఒక బాలికల పాఠశాల నిర్మాణం కావాలి దానికోసం మీరు అధికార దగ్గర ఏరోజైనా మాట్లాడారా మన హోళగుంద మండలంలో వైద్యులు లేక చాలామంది తమ ప్రాణాలను పోగొట్టుకున్న గర్భవతులు రోగులు ఉన్నారు వారి సమస్యల కోసం మీరు ఏ రోజైనా వచ్చి ఉన్నంత అధికారులు దగ్గర మీరు అడిగారా ఇప్పటికైనా ఓటర్ల మహాశయుల ఆలోచించాలి మనకు కావాల్సింది అభివృద్ధి.ఓటుకు నోటు మందు బిర్యానీ ప్యాకెట్లకు ఎవరు ఆశపడకండి.మన ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి గురించి ఆలోచించి ఎవరైతే మనకు హామీలు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు వారికి ఓటు వేయండి హామీలను నెరవేర్చని ఎడల వాళ్లని నిలదీసే దమ్ము ధైర్యం మనలో రావాలి.ఓటర్ల మహాశయులు భారత రాజ్యాంగ ప్రకారంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకొని.ప్రజా పరిపాలన చేసే నాయకులని మన నియోజకవర్గ అభివృద్ధి చేసే నాయకున్ని ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాను.